Twelve years
-
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
Israel-Hamas war: హమాస్ రాక్షసత్వం
టెల్ అవీవ్: ప్రఖ్యాత రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన హ్యారీ పోట్టర్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక నోయా డాన్ ఆటిజం బాధితురాలు. ఆమెకు హ్యారీ పోట్టర్ సాహసాలంటే చెప్పలేనంత ఇష్టం. ఈ సిరీస్‌లో వచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు నోయా డాన్‌ను అపహరించారు. ఆమె నాన్నమ్మతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు బందీలుగా గాజాకు చేరారు. వారంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియరాలేదు. అసలు బతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆటిజం బాధితురాలైన నోయా డాన్‌ను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌ను కోరింది. హ్యారీపోట్టర్ పాత్రధారి ఆహార్యంతో ఉన్న నోయా డాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది షేర్ చేశారు. హమాస్ చెర నుంచి నోయా డాన్‌ను విడిపించేందుకు చొరవ చూపాలంటూ జేకే రౌలింగ్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జేకే రౌలింగ్ వెంటనే స్పందించారు. హ్యారీ పోట్టర్ అభిమాని కిడ్నాప్ అయ్యారని తెలుసుకొని చలించిపోయారు. ఆమెకు విముక్తి కలి్పంచాలని హమాస్‌ను అభ్యరి్థంచారు. నోడా డాన్ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రౌలింగ్ ప్రతిస్పందన తర్వాత ఇజ్రాయెల్ వ్య«థకు నోయా డాన్ ఒక ప్రతీకగా మారిపోయారు. ఇజ్రాయెల్ పౌరులంతా ఆమె గురించి చర్చించుకున్నారు. క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. కానీ, ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. నోయా డాన్తోపాటు ఆమె నాన్నమ్మ కార్మెలా మృతదేహాన్ని బుధవారం గాజాలో గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నోయా డాన్ ఇక లేదని తెలిసి ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలికను హమాస్ మిలిటెంట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా, నాకు చాలా భయమేస్తోంది. ఎవరో బూచాళ్లు మన ఇంట్లోకి వచ్చారు. వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకెళ్లు’’.. బయటకు వెళ్లిన తన తల్లితో ఫోన్లో నోయా డాన్ చివరి సంభాషణ ఇది. -
అర్ధనగ్నంగా రక్తమోడుతూ
ఉజ్జయిని: మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిన ఘటన ఇది. ఒక చిన్నతల్లికి పెద్ద కష్టం వచ్చి వీధుల్లో తిరుగుతూ సాయం కోరినా ఎవరూ ముందుకు రాని దారుణమైన పరిస్థితి ఇది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. చిన్నారికి వచి్చన ఆ కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. కొందరు పొమ్మంటూ సంజ్ఞలు కూడా చేయడం కూడా కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అందరికీ ఈ దారుణం గురించి తెలిసింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచి్చందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని సూపరిండెంట్ ఆఫ్ పోలీసు సచిన్ శర్మ చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. ఆ బాలిక అలా ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఆమె భవిష్యత్ కోసం కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, రేపిస్టుకి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
పన్నెండేళ్లుగాజైలులోనే..
‘పన్నెండేడ్లాయే కొడుకులు కనిపియ్యక. ఎప్పుడస్తరా అని చూస్తున్నం. మన దేశం కాదు.. మన రాజ్యం కాదు. వాళ్లక్కడ దుబాయి జైల్లో ఉన్నారు. ఎట్ల ఇడిపియ్యాలో తెల్వదు. నెల రోజులుగా నాకు జెరమత్తుంది. కొడుకులెప్పు డత్తరా అని సిరిసిల్ల తొవ్వదిక్కు సూత్తున్న. కొడుకులిద్దరు కండ్లళ్ల కనిపిత్తుండ్రు బాంచెన్. వాళ్లను కంటినిండా చూస్కోని సచ్చిపోవాలని పిస్తోంది’ అంటూ కన్నీరు పెడుతోంది శివరాత్రి గంగవ్వ. పన్నెండు సంవత్సరాలుగా కన్నకొడుకులిద్దరూ దుబాయ్‌లో ఓ హత్య కేసులో ఇరుక్కొని జైలుశిక్ష అనుభవిస్తున్నారు. బండలు కొట్టి బతికే ఆ గరీబోళ్లకు గల్ఫ్ మానని గాయం చేసింది. అక్షరజ్ఞానం లేని ఆ నిరుపేదలకు తమ వాళ్లను ఎలా విడిపించుకోవాలో తెలియడం లేదు. దౌత్యపరమైన సహాయం లభించక నిత్యం కన్నీళ్లతో వెళ్లదీస్తున్నారు ఆ అభాగ్యులు. మా వాళ్లను విడిపియ్యుండ్రి బాంచెన్ అంటూ బంధీల భార్యలు రేణ, రాజవ్వలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఏం జరిగిందంటే... రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(45), శివరాత్రి రవి(42) అన్నదమ్ములు. 2004లో దుబాయికి బతుకుదెరువుకు వెళ్లారు. వీరితో పాటు కోనరావుపేట చెందిన దండుగుల లక్ష్మణ్(45), చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి(40), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(48) కూడా దుబాయికి వెళ్లారు. కంపెనీలో పని బాగా లేదని బయటకు వచ్చి (ఖల్లివెల్లి అయి)వేరేచోట పనిచేసుకుంటున్నారు. జబల్అలీ ప్రాంతంలో నలుగురు పాకిస్తానీయులతో పాటు గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీం, వీరు కలిసి పనిచేస్తున్నారు. కాగా, 2005లో వీరు పనిచేస్తున్న ప్రాంతంలో నేపాల్‌కు చెందిన దిల్ బహదూర్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. ఈ హత్యను వీరే చేశారని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి 2006లో జైలులో పెట్టారు. పరిహారమిచ్చినా దక్కని క్షమాభిక్ష దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీ(పరిహారం) చెల్లించి వారిచేత క్షమాభిక్ష అంగీకారం తీసుకుంటే కోర్టు శిక్షను రద్దు చేస్తుంది. ఈ పరిహారాన్ని అరబిక్ భాషలో ‘దియా’ అంటారు. బహదూర్ హత్య కేసులో నేపాల్‌లోని అతని భార్య రూ.15 లక్షలు చెల్లిస్తే క్షమాభిక్ష పెడతానని అంగీకరించింది. అంత డబ్బు చెల్లించే స్థోమత లేక బాధితులు 2012 నవంబరులో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కిడ్నీలు అమ్ముకొని నేపాల్‌లోని బాధిత కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని, అందుకు అనుమతించాలని కోరుతూ బాధితులు హెచ్ఆర్సీని కలిశారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో రావడంతో బాధితులకు ఆర్థికసాయం అందించేందుకు అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. ఆయన స్వయంగా నేపాల్ వెళ్లి ఐదేళ్ల కిందటే హత్యకు గురైన బహదూర్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలుఅందించారు. క్షమాభిక్ష పత్రంపై మృతుడి భార్య సంతకం చేసింది. ఈ మేరకు సంబంధిత పత్రాలను దుబాయి కోర్టుకు సమర్పించారు. అయితే వీరిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు హత్య, కాపర్‌వైరు చోరీ, దేశం విడిచి పారిపోవడం అనే మూడు నేరా రోపణలను మోపారు. హత్య కేసులో క్షమాభిక్ష లభించినప్పటికీ మరో రెండు కేసుల్లో దుబాయి కోర్టు క్షమాభిక్షకు నిరాకరించింది. ఇదే కేసులో పాకిస్తాన్‌కు చెందిన మరో నలుగురిని, గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. కానీ ఈ ఐదుగురు మాత్రం ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. దక్కని దౌత్యపరమైన సాయం.. భారత దేశానికి చెందిన ఐదుగురిని విడిపించేందుకు దౌత్యపరమైన సాయం దక్కలేదు. రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ఈ విషయమై విదేశీ వ్యవహరాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్తోనూ చర్చించారు. దుబాయి రాజు క్షమాభిక్ష పెడితేనే ఐదుగురు బంధీలు విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ మన రాయబార కార్యాలయం నుంచి దుబాయిలోని ముఖ్య అధికారులతో దౌత్యపరమైన చర్చలు జరగకపోవడంతో బాధితులు బంధీలుగానే ఉన్నారు. దుబాయ్ కోర్టులో బందీల తరఫున వాదిస్తున్న న్యాయవాది అనురాధ ఇటీవల పెద్దూరుకు వచ్చి బంధీల తల్లి, భార్య, బిడ్డలతో మాట్లాడి వెళ్లారు. దుబాయి రాజు మాత్రమే క్షమాభిక్షను ప్రసాదించాల్సి ఉందని అనురాధ తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఖైదీలకు లభించే క్షమాభిక్షలో వీరి పేర్లుకూడా చేరుస్తారని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌పై ఆశలు.. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ప్రవాసీ తెలంగాణ మంత్రి కె.తారక రామారావుపైనే బాధితులు ఆశలు పెట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ స్థాయిలో కల్పించుకుని దౌత్యపరమైన జోక్యం చేసుకుంటే బంధీల విడుదలకు మార్గం ఉంటుందని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సైతం న్యాయవాది అనురాధతో చర్చించారు. -
12 ఏళ్లైనా గుర్తించలేని 400 మృతదేహాలు!
2004 డిసెంబర్ 26 గుర్తుండే ఉంటుంది. 9.15 తీవ్రతతో హిందూ మహా సముద్రంలో సంభవించిన భూకంపం, రాకాసి సునామిగా మారి లక్షలాది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో పుట్టిన ఈ జలప్రళయానికి థాయ్‌లాండ్, ఇండోనేషియా, శ్రీలంక, భారత్ దేశాలు అల్లకల్లోమయ్యాయి. కర్కశ అలల తాకిడికి కుటుంబాలకు కుటుంబాలే సముద్రం గర్భంలో కలసిపోయాయి. ఈ సునామి వచ్చి 12 ఏళ్లు గడిచినా ఇంకా 400 మేర మృతదేహాలను గుర్తించలేకపోతున్నామని పోలీసులకు పేర్కొన్నారు. 2,26,000 మంది ఆ సునామికి మరణిస్తే, వారిలో 400 మంది మృతదేహాలు ఎవరివో థాయ్‌లాండ్‌లో గుర్తించలేదని పోలీసులు సోమవారం ప్రకటించారు. 2004లో సునామి సంభవించినప్పటి నుంచి 4000 నుంచి 5000 మంది కుటుంబసభ్యులను సంప్రదించామని, వచ్చి మృతదేహాలను తీసుకోమని తెలిపినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఇంకా 400 మంది మృతదేహాల ఎవరివో గుర్తించలేకపోయామన్నారు. వారికి సంబంధించిన వారెవరూ మృతదేహాలను తీసుకోవడానికి రాలేదన్నారు. థాయ్‌లాండ్‌లో ఆ రోజు మరణించిన 5,395 మంది ప్రజల్లో 2000 మంది విదేశీ పర్యాటకులే ఉన్నారు. సునామికి తీవ్రంగా ప్రభావితమైన థాయ్‌లాండ్ ప్రస్తుతం పర్యాటకులతో మంచి ఊపుమీద ఉందని పోలీసులు పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా జరిపోతున్నాయన్నారు. జలప్రళయానికి నిండిపోయిన ప్రాంతాలన్నీ ప్రస్తుతం కొత్త కొత్త హోటల్స్‌తో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు రికార్డు స్థాయిలో 32.4 మిలియన్ల విదేశీ పర్యాటకలు వెళ్లారు. మరో జలప్రళయం.. ఆ జలప్రళయ ఆనవాళ్లు ఇంకా పూర్తిగా తుడిచిపోక ముందే, అప్పుడే మరో జలప్రళయానికి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సదరన్ చిలీ ప్రాంతంలో ఆదివారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామిగా మారబోతుందని అధికారులు హెచ్చరించారు. పోర్టోమాంట్‌కు 1000 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతంలో సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.