Ujjaini
-
ఉజ్జయిని మహాకాళేశ్వరునికి రక్షా బంధనం
-
కోలుకుంటున్న ‘ఉజ్జయిని’ బాలిక
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరుగాడిన బాలిక కోలుకుంటోంది. ఇండోర్‌లోని మహారాజా టుకోజీరావ్ హోల్కార్ మహిళా ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తోంది. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలను చెప్పలేకపోతోందని, అయితే ఆమెది సత్నా జిల్లా అని తెలుస్తోందని కౌన్సిలింగ్ నిపుణులు గురువారం తెలిపారు. బాధిత బాలిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతోందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ దివ్యా గుప్తా తెలిపారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలు సున్నితత్వం ప్రదర్శించాలని, బాధిత బాలిక చికిత్స పొందే ఆస్పత్రి వద్ద గుమికూడడం వంటివి చేయరాదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి భరత్ సోని అనే రిక్షావాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం జీవన్ ఖేది ప్రాంతానికి గురువారం పోలీసులు తీసుకెళ్లగా పారిపోయే ప్రయత్నంలో గాయపడ్డాడు. పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో రెండున్నర గంటలపాటు సాయం కోరుతూ ఇల్లిల్లూ తిరిగినా పట్టించుకోకపోవడం అమానవీయమని ఎస్పీ సచిన్ శర్మ అన్నారు. ‘నా వెనుక ఎవరో వస్తున్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను’అని ప్రాధేయపడిందే తప్ప ఆమె డబ్బులు అడగలేదన్నారు. ‘కొందరు ఛీత్కరించినా, కొందరు రూ.50, రూ.100 వరకు ఇచ్చారు. అదేదారిలో ఉన్న టోల్‌ప్లాజా సిబ్బంది కొంత డబ్బు, బట్టలు ఇచ్చారు. చివరికి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. వారామెను దగ్గరకు తీసి, మాకు సమాచారం అందించారు’అని ఎస్పీ వివరించారు.. -
అర్ధనగ్నంగా రక్తమోడుతూ
ఉజ్జయిని: మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిన ఘటన ఇది. ఒక చిన్నతల్లికి పెద్ద కష్టం వచ్చి వీధుల్లో తిరుగుతూ సాయం కోరినా ఎవరూ ముందుకు రాని దారుణమైన పరిస్థితి ఇది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. చిన్నారికి వచి్చన ఆ కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. కొందరు పొమ్మంటూ సంజ్ఞలు కూడా చేయడం కూడా కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అందరికీ ఈ దారుణం గురించి తెలిసింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచి్చందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని సూపరిండెంట్ ఆఫ్ పోలీసు సచిన్ శర్మ చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. ఆ బాలిక అలా ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఆమె భవిష్యత్ కోసం కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, రేపిస్టుకి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు
ఉజ్జయిని: మహా శివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఏకంగా 18,82,229 దీపాలు వెలిగించారు. గిన్నిస్ రికార్డు సృష్టించారు. శనివారం సాయంత్రం క్షిప్రా నది ఒడ్డున నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 2022లో అయోధ్యలో అత్యధికంగా 15.76 లక్షల దీపాలు వెలిగించారు. ఉజ్జయినిలో గత శివరాత్రి సందర్భంగా 11,71,078 దీపాలు వెలిగించారు. -
అమ్మాయి డ్యాన్స్ వీడియో వివాదాస్పదం...హోం మంత్రి సీరియస్
మధ్యప్రదేశ్‌లో ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మద్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ అవ్వడమే కాకుండా కలెక్టర్, ఎస్సీని ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత విశ్వాసాలతో చెలగాటమాడితే సహించేది లేదని మిశ్రా మండిపడ్డారు. ఐతే ఈ వీడియోలో ఆ అమ్మాయి గర్భగుడిలో జలాభిషేకం చేస్తున్నప్పుడూ కాంతులు వెదజిమ్మితున్నట్లు ఎఫెక్ట్స్ వంటివి పెట్టింది. అదీగాక ఆలయ పరిసరాల్లో డ్యాన్సులు చేస్తూ బ్యాగ్రౌండ్లో బాలీవుడ్ పాట వీడియోలో వినిపిస్తుంది. మరో యువతి ఆలయంలో పరిసరాల్లో వీడియో తీస్తున్నట్లు ఉంటుంది. ఐతే ఈ వీడియోపై ఆలయ పూజారి మహేష్గురు ఇది సనాతన సాంప్రదాయానికి విరుద్ధమంటూ సదరు అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆలయ పవిత్రతను మంటగలిపేలా ఉందంటూ మండిపడ్డారు. అలాగే మహకాల్ ఆలయ ఉద్యోగులు కూడా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని పూజారి అన్నారు. (చదవండి: బిల్కిస్ బానో కేసు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు) -
హృతిక్ రోషన్ యాడ్‌పై జొమాటో క్షమాపణలు
భోపాల్: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించిన మహాకాల్ వాణిజ్య ప్రకటన వివాదం కావడం తెలిసే ఉంటుంది. boycott zomato ట్రెండ్ కూడా సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్షమాపణ చెప్పింది. తాము పేర్కొన్న మహాకాల్ ఒక రెస్టారెంటే తప్ప ఉజ్జయిని ఆలయానికి సంబంధించింది కాదంటూ వివరణిచ్చింది. ఆ ప్రకటనలో హృతిక్..‘ఉజ్జయినిలో నాకు థాలి(నార్త్ ఇండియా భోజనం) తినాలనిపిస్తే మహాకాల్ నుంచే తెప్పించుకుని తింటా’ అని అంటాడు. దీనిపై మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఉజ్జయిని కలెక్టర్.. మహాకాల్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశిష్ సింగ్ స్పందిస్తూ.. భక్తులు ఇక్కడి ప్రసాదాన్ని పరమపవిత్రంగా భావిస్తారని, అలాంటిది ఈ యాడ్ వాళ్ల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో.. తమ ప్రకటన ఉజ్జయినిలోని అందరికీ తెలిసిన మహాకాల్ రెస్టారెంట్‌కు మాత్రమే సంబంధించిందని జొమాటో వివరణ ఇచ్చుకుంది. ఉజ్జయిని ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని, ఇకపై ఆ యాడ్‌ను ప్రదర్శించబోమని జొమాటో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మహాకాల్ దైవప్రసాదం.. అవమానిస్తారా? -
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా 21 ఏళ్ల అమ్మాయి!
21-year-old Ujjain Girl: మధ్యప్రదేశ్‌లోని చింతామన్ జవాసియా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిని ఓడించి 487 ఓట్ల ఆధిక్యంతో గెలిచిని అతి పిన్న వయస్కురాలిగా ఉజ్జయినికి చెందిన 21 ఏళ్ల అమ్మయిగా లతికా దాగర్ రికార్డు సృష్టించారు. లతికా మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ...గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. అంతేకాదు ఆమె మేనిఫెస్టోలో తాగునీరు, డ్రైన్, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తానని, ఇళ్లు లేని కుటుంబాలకు గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందంటూ పలు రకాలు హామీలు ఇచ్చి మరీ గెలుపొందారు. అంతేకాదు మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్‌లోని అతి పిన్న వయస్కురాలైన మహిళా సర్పంచ్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ రికార్డును యాదృచ్ఛికంగా తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!) -
‘బరువు తగ్గితే ప్రతీ కిలోకి వెయ్యి కోట్లు ఇస్తానన్నారు’
భోపాల్: ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్రమంత్రి గడ్కరీ.. ఉజ్జయిని ఎంపీ అనిల ఫిరోజియాకి ఒక షరతు విధించారు కూడా. తాను నిధులు మంజూరు చేయాలంటే ముందు తమరు చాలా బరువు తగ్గండి అప్పుడూ మంజూరు చేస్తానంటూ ఒక కండిషన్ కూడా పెట్టారు. అంతేకాదు గడ్కరీ ఫిరోజియా తాను ఏవిధంగా బరువు తగ్గానో కూడా వివరించి చెప్పారు.. ఈ మేరకు గడ్కరీ మాట్లాడుతూ...తాను గతంలో 135 కిలోలు బరువు ఉన్నానని, ప్రస్తుతం 93 కిలోలే ఉన్నాను. అప్పుడూ ప్రజలు నన్ను అసలు గుర్తు పట్టలేకపోయారు. అందువల్ల మీరు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. అంతేకాదు తగ్గిన ప్రతి కిలో బరువుకి వెయ్యి కోట్లు చొప్పున తమ నియోజక వర్గం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తాననంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిరోజియాకి ఒక గొప్ప చాలెంజ్ విసిరారు. దీంతో ఫిరోజియా అప్పటి నుంచి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టడమే కాకుండా బరువు తగ్గేడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆయన రకరకాల వ్యాయామాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పనుల నిధులతో చట్టసభ సభ్యుల శారీరక దృఢత్వాన్ని అనుసంధానించే అభివృద్ధి మంత్రం బాగా పనిచేస్తుందనే చెప్పాలి. ఫిరోజియా కూడా తన నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరయ్యేందుకైనా ఆయన బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అంతేకాదు వర్షాకాలం సమావేశం కల్లా తగ్గి... ఆయన్ను కలిసి మీరు ఇచ్చిన చాలెంజ్‌ని నెరవేర్చానని గుర్తుచేసి మరీ చెబుతానంటున్నారు కూడా. ఈ మేరకు ఫిరోజియా ఫిరోజియా డైట్ ప్లాన్‌ను పాటిస్తూ...సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా చేస్తున్న వీడియోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. BJP MP from Ujjain @bjpanilfirojiya is on a mission to shed excess flab, not just to become fit, but also to fund the development of his Lok Sabha constituency as promised by Union Minister @nitin_gadkari @ndtv @ndtvindia pic.twitter.com/t7qv7K0FAB — Anurag Dwary (@Anurag_Dwary) June 11, 2022 (చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..?) -
రెండో ఉజ్జయిని.. రాజమహేంద్రవరం
ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి.. మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి.. ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతోంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అక్కడ నిత్యం... ‘నాగేంద్రహారాయ త్రిలోచనాయ.. భస్మాంగరాయ మహేశ్వరాయ.. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ.. తస్త్మేన్త కారాయ నమశ్శివాయ!’ అంటూ వేద మంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద ఝరిలో ఓలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చెంత కొలువుదీరింది. ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తిపారవశ్యంతో కట్టిపడేస్తోంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు ఇవి.. ఆలయ నిర్మాణానికి బీజం పడిందిలా.. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతోపాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకట్రావు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమీ ఘాట్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. ఆధునికత ఉట్టిపడేలా.. ఆధ్యాత్మికుల మనసు దోచుకునేలా.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుంచి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటోంది. 75 అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు, 55 అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు బలిపీఠాలు, నాలుగు త్రిశూలాలు, నాలుగు నందులను తిలకించారంటే భక్తులు ఆనందపారవశ్యంతో మునిగితేలాల్సిందే. గర్భాలయానికి నాలుగు వైపుల గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత, 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉప ఆలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్లేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతోపాటు బలిపీఠాలు, నందులు తిరుమలలో, ఉప ఆలయాల్లోని విగ్రహాలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో తయారుచేయించారు. ప్రత్యేకం.. భస్మాభిషేకం రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.. భస్మాభిషేకం. ఇక్కడ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తోన్న రెండు కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలకు కూడా అనుమతిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అందుబాటులో ఉండాలనే.. రాజమహేంద్రవరం ఖ్యాతి దేశం నలుదిశలా విస్తరించాలనే సంకల్పంతోనే ఆలయం నిర్మించాం. చారిత్రక నగరం కావడంతో ఇక్కడి ప్రాశస్త్యం భావితరాలకు గుర్తుండిపోవాలనే ఆలయాన్ని ప్రారంభించాం. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఇది ఎంతో అందుబాటులోకి వచ్చింది. మరింత అభివృద్ధి చేస్తాం. – పట్టపగలు వెంకట్రావు, చైర్మన్, రోటరీ చారిటబుల్ ట్రస్ట్, మహాకాళేశ్వరాలయం -
డ్రెస్‌కోడ్ మార్చకపోతే రైలుని అడ్డుకుంటాం.. దెబ్బకు దిగొచ్చిన రైల్వే శాఖ
ఉజ్జయిని: రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పనిచేసే వెయిటర్ల డ్రెస్‌కోడ్‌ను రైల్వే శాఖ సోమవారం ఉపసంహరించుకుంది. వారి యూనిఫామ్‌ను మార్చేసింది. వారి డ్రెస్‌కోడ్ పట్ల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మత గురువులు, సాధువులు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. వెయిటర్లు సాధువుల తరహాలో కాషాయ రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి, రైలులో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇది హిందూ మతాన్ని అవమానించడమే అవుతుందని వారు ఆక్షేపించారు. డ్రెస్‌కోడ్‌ను మార్చకపోతే ఢిల్లీలో ఈ రైలును అడ్డుకుంటామన్నారు. రెండు రోజుల క్రితం రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో రైల్వే శాఖ వెంటనే స్పందించింది. సిబ్బంది దుస్తులను మార్చింది. సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజ్‌ల్లో మార్పులు చేయలేదు. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 7,500 కి.మీ.ల మేర దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టేసి మళ్లీ ఢిల్లీకి చేరుకోనుంది. -
ఆపరేషన్ థియేటర్లో నర్సుకు ముద్దుపెట్టాడు..
ఉజ్జయిని: ఆపరేషన్ థియేటర్లో విధులను మరిచి ప్రవర్తించిన ఓ ప్రభుత్వ వైద్యుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ నర్సును ఆపరేషన్ థియేటర్లో ముద్దుపెట్టుకున్నాడు. అయితే ఆపరేషన్ థియేటర్లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఈ వీడియో తొలుత ఆస్పత్రికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం కలెక్టర్ శశాంక్ మిశ్రా దాకా వెళ్లడంతో.. ఆయన వెంటనే స్పందించారు. ఆ వైద్యుని విధుల నుంచి తొలగించడంతోపాటు, ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి మోహన్ మల్వియా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, స్థానిక పోలీసులకు ఈ కేసులో అధికారింగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. -
కశ్మీర్ తగలబడుతోంది
ఉజ్జయిని: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన తప్పుల కారణంగా కశ్మీర్ తగలబడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపిం చారు. రెండురోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆయన పర్యటించారు. ముందు గా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివభక్తుడైన రాహుల్ గాంధీ 2010లోనూ ఈ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మాల్వా– నిమాడ్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ..ఒక ర్యాంకు– ఒక పెన్షన్ (ఓఆర్ఓపీ) పథకంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు గత కొద్దీ రోజులుగా కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తప్పిదాల కారణంగా జవాన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు కశ్మీర్ తలుపులు బార్ల తీసిందని ఆరోపించారు. ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్స్, ఆర్మీ, నేవీ గురించి మాట్లాడే మోదీ..సైనికుల సమస్యలపై మాత్రం పల్లెత్తు మాట మాట్లాడరని విమర్శించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ వల్ల సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని మోదీని డిమాండ్ చేశారు. -
ఉజ్జయిని శివాలయంలో రాహుల్ పూజలు
సాక్షి, ఇండోర్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర ఆలయంలో కాంగ్రెస్ చీఫ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పాటు సాగే ప్రచారానికి ముందు రాహుల్ ఆలయ సందర్శన చేపట్టారు. గతంలో బీజేపీ చీఫ్ అమిత్ షా మధ్యప్రదేశ్ సీఎం చేపట్టిన జనాశీర్వాద్ యాత్ర ప్రారంభించే ముందు ఈ ఏడాది జులై 14న ఉజ్జయిని ఆలయం సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ హిందుత్వ కార్డును ప్రయోగించేందుకే ఆలయాల చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ శివభక్తుడని, ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ బదులిస్తోంది. కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ జబువ, ఇండోర్, దర్, ఖర్గోన్, మోలో జరిగే ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోర్‌లో జరిగే రోడ్‌షోలోనూ పాల్గొంటారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. -
ఆ ఆలయాన్ని పేల్చేస్తాం : లష్కరే
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో భీకర దాడులతో అలజడి సృష్టిస్తామని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. అక్టోబర్ 20, నవంబర్ 9 తేదీల్లో భీకర దాడులు చేపడతామని లష్కర్ ఏరియా కమాండర్ మౌల్వి అబు షేక్ రావల్పిండి నుంచి హెచ్చరిక లేఖ రాసినట్టు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. అక్టోబర్ 20న ఎలాంటి విధ్వంసం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నా నవంబర్ 9న ఎలాంటి అలజడి రేగుతుందనే ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని పేల్చివేస్తామని సైతం లష్కరే హెచ్చరించడంతో నిఘా, భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఉగ్ర సంస్థ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసిందనే అనుమానంతో భోపాల్, గ్వాలియర్, కట్ని, జబల్పూర్లో హై అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లకు లష్కరే దాడుల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. 2008 నవంబర్ 26న ముంబై పేలుళ్లలో 166 మంది మరణించడం, 300 మందికి పైగా గాయపడిన దారుణ ఘటనను లష్కరే ఉగ్రవాద సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది!
ఆమె ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది.సంవత్సరంలో ఒకరోజు ఆమె వైపు భక్తజనమంతా చూస్తుంది.కాని మిగిలిన అన్ని రోజులు ఆమె ఒక సాధారణ టైలర్లా జీవితం గడుపుతుంది. మాతంగి స్వర్ణలత జీవన పరిచయం ఇది. ఆ క్షణాలు ఉద్వేగభరితం. కోట్లాది జనసందోహం ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తుంటుంది. ఏడాదికోసారి వినిపించే ఆ మాటల కోసం ఆ క్షణంలో అంతా ఊపిరి బిగపట్టి ఆలకిస్తారు. ఎందుకంటే ఆ మాటలు ఉజ్జయిని మహంకాళి మధుర వాక్కులు. అవి అందరినీ కాపాడే ఆ చల్లని తల్లి దీవెనలు. ప్రజలంతా సుఖశాంతులతో బతకాలనే ఆకాంక్షలు. అమ్మవారికి ఆగ్రహం వచ్చినా, ఆనందం కలిగినా ఆమె మాటల్లోనే వెల్లడిస్తుంది. పాలించేవారికి దిశానిర్దేశం చేస్తుంది. పాలితులకు మార్గదర్శనం చేస్తుంది. ఆ క్షణాల్లో అమ్మవారు పచ్చికుండతో చేసిన రంగంపైకి ఎక్కి భవిష్యవాణి వినిపిస్తుంది. ఆ అపురూప క్షణాల్లోనే అమ్మవారు మాతంగి స్వర్ణలత అవుతుంది. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని నిండైన విగ్రహంలా కదిలి వచ్చే మాతంగి స్వర్ణలత అప్పుడు ఉజ్జయిని మహాంకాళి ఆవాహనమవుతుంది. రెండు దశాబ్దాలకు పైగా రంగం ఎక్కి భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత ఒక విశిష్టమైన సాంసృతిక ఆవిష్కరణ అవుతుంది. రెండువందల ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు ఆమె ఒక కొనసాగింపు. నగరమంతా ఆషాఢమాసపు ఆ«ధ్యాత్మికతను సంతరించుకుంటున్న వేళ మాతంగి స్వర్ణలత ప్రస్థానం పై ’సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. తరతరాలుగా.. వారసత్వంగా.. ముఖం నిండా పసుపు. పెద్ద పెద్ద కళ్లు. నుదుటిపై నిండుగా ఉన్న కుంకుమ బొట్టు. పసుపు కుంకుమలతో అలంకరించుకొన్న నిండైన దేహం. పచ్చికుండపై నిలిచిన పాదాలు. చేతిలో కిన్నెర. భవిష్యత్తులోకి తొంగి చూసే సునిశితమైన చూపులు. ఆ సమయంలో అమ్మవారిని ఆవాహనం చేసుకున్న స్వర్ణలత రూపం, మాటలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఆమె సాధారణ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు చెప్పే దైవానికి ఆమె ప్రతిరూపమే అవుతుంది. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అవతరించిన తరువాత భవిష్యవాణి వినిపించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. అమ్మాయిలంతా అమ్మవారికే ‘ఏర్పుల’ వంశానికి చెందిన మహిళలు ఆ సాంప్రదాయానికి ప్రతీకలు. మొట్టమొదట ఏర్పుల జోగమ్మతో ఇది మొదలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ ఈ సంప్రదాయంలో భాగస్వాములయ్యారు. 1996 వరకు స్వర్ణలత అక్క ఏర్పుల స్వరూపారాణి రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించింది. 1997 నుంచి ఇప్పటి వరకు స్వర్ణలత ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ‘మా కుటుంబంలో పుట్టే అమ్మాయిలంతా అమ్మవారికే అంకితం. ప్రతి అమ్మాయి మాతంగి కావలసిందే. ఇప్పటివరకు మాతంగులైన వాళ్లంతా నాతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను తాము మహంకాళికి సమర్పించుకున్న వాళ్లే. మా కుటుంబంలో మా తమ్ముడు దినేష్‌కు ఆడపిల్ల పుడితే తప్పకుండా నా తరువాత ఆమే భవిష్యవాణి వినిపిస్తుంది...’ అని చెబుతోంది స్వర్ణ. సంక్షేమమే చెబుతుంది పదోతరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నవయస్సులోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో వైభవంగా ఆ పెళ్లి జరిగింది. ఆ తరువాత ఆమె జీవితం అమ్మవారి సేవకే అంకితమైంది. అప్పటి నుంచే భవిష్యవాణి వినిపిస్తోంది. ఆమె వినిపించే భవిష్యవాణిని ప్రజలే కాదు ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. భవిష్యవాణిలో చెప్పే సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది. ఆ భవిష్యవాణిలో ప్రజలందరి సంక్షేమం నిక్షిప్తమై ఉంటుంది. జీవిక కోసం టైలరింగ్ ఏడాదికోసారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి లక్షలాది మంది భక్తులు, అధికారగణాలు, అతిర«థమహార«థులు కొలువుదీరి ఉండే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి జంకు లేకుండా, అమ్మవారికి ప్రతిరూపమై భవిష్యవాణి వినిపించే స్వర్ణలత సాధారణ జీవితంలో ఒక టైలర్. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద. ఆమె కుటుంబం తుకారాంగేట్‌లోని ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తుంది. ‘మా నాయిన ఏర్పుల నర్సింహ మొదటి నుంచి గుడి దగ్గర పంబజోడు వాయించేవాడు. మా అమ్మ ఇస్తారమ్మ నాయినతో పాటు గుడికి వచ్చి జేగంట మోగించేది. తరతరాలుగా ఇది మా వృత్తి. అమ్మా, నాయిన ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో నేను, మా తమ్ముడు దినేష్, పిన్ని, వదిన ఉంటున్నాం. దినేష్ ఎలక్ట్రీషియన్. ఇద్దరం కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. బతకాలంటే కష్టపడాల్సిందే కదా’ అంటూ నవ్వేస్తుంది. స్వర్ణ మంచి లేడీస్ టైలర్. అన్ని రకాల డిజైన్లలో బ్లౌజులు, ఇతర దుస్తులు కుట్టేస్తుంది. ఏడాది పాటు రాత్రింబవళ్లు కష్టపడి పని చేసినా ఏడాదికోసారి వచ్చే ఆషాఢమాసం కోసం మాత్రం ఆమె వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటుంది. ‘‘ఏర్పుల బాగమ్మ మాకు నాయినమ్మ వరుస అవుతుంది. ఆమె ప్రభావం మాపై కొంతవరకు ఉంది. కానీ ఆ తరువాత రంగం ఎక్కిన మా అక్క స్వరూపారాణితో కలిసి నేను గుడికి వచ్చేదాన్ని. ఆమె వారసత్వంగానే నేను వచ్చాను’ అంటూ గలగలా నవ్వేసే స్వర్ణకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తే ఆ కుటుంబానికి ఎంతో ఊరట లభిస్తుంది. రంగం’ ఒక ఆ«ధ్యాత్మిక వేదిక ఆషాఢమాసం అమావాస్య తరువాత వచ్చే ఆదివారంతో ఉజ్జయిని మహంకాళి వేడుకలు ఆరంభమవుతాయి. గర్భాలయంలోని అమ్మవారి ఆభరణాలు, ముఖాకృతిని అందంగా అలంకరించిన ఘటంతో తీసుకొని రాణిగంజ్‌లోని కర్బలా మైదానానికి ఎదుర్కోలుకు వెళుతారు. ఈ నెల 15వ తేదీన ఆ వేడుక మొదలవుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఘటంతో ఎదుర్కోలు వేడుకలు నిర్వహిస్తారు. మహంకాళి అమ్మవారు తన ఉత్సవాలకు రావలసిందిగా తన తోటి 18 మంది అక్కచెల్లెళ్లను ఆహ్వానించడమే ఈ ఘటోత్సవం. ఆ తరువాత న్యూబోయిగూడలోని దండు మారమ్మ ఆలయానికి వెళ్తారు. అది మహంకాళి పుట్టినిల్లు. అక్కడి నుంచి గర్భాలయానికి చేరుకోవడంతో ఎదుర్కోలు ఘట్టం ముగుస్తుంది. ఆ తరువాత ఈ నెల 29వ తేదీన బోనాల ఉత్సవాలు. 30న ’రంగం’నిర్వహిస్తారు. ఈ ఆ«ధ్యాత్మిక వేదికను స్వర్ణలత తమ్ముడు దినేష్ అలంకరిస్తాడు. పచ్చికుండను కొద్దిగా భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేస్తారు. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. జేగంటలు మోగుతాయి. పంబజోడు ఉత్సవం ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే ఆలయానికి చేరుకుంటుంది స్వర్ణలత. ‘ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి నాకు ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. నేరుగా రంగం వద్దకు వస్తాను. ఆ తరువాత ఏం జరుగుతుందో నాకు తెలియదు...’ అంటున్న మాతంగి స్వర్ణలత ఆ తుదిఘట్టంలో 15 నిమిషాల పాటు భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె వినిపించే భవిష్యవాణి కోసం ఎదురు చూద్దాం. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ -
జోడీ కోసం.. 250 కి.మీ. ప్రయాణం
సాక్షి, ఇండోర్ : విరహతాపం తీర్చుకునేందుకు మధ్యప్రదేశ్‌లో ఒక పులి అసాధారణ విన్యాసం చేసింది. జోదడీని వెదుక్కుంటూ దాదాపు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే ఇంత సాహసం చేసిన మగ పులికి తోడు మాత్రం దొరకలేదు. దీంతో ఆడతోడు కోసం మగ పులి విరహంతో తపిస్తూ.. ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ అటవీశాఖాధికారులు కూడా ధృవీకరించారు. దాదాపు మూడేళ్ల వయసున్న ఒక మగపులి.. తోడుకోసం తపిస్తోంది. ఆడపులిని వెతుక్కుంటూ.. దీవాస్, ఉజ్జయిని, ధార్, జబువా జిల్లాలను దాటుకుంటూ.. 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. మగపులి విరహం గురించి ఉజ్జయినీ అటవీ అధికారులు స్పందించారు. మగపులి బాధను మేం అర్థం చేసుకోగలం.. అయితే ఈ ప్రాంతంలో ఎక్కడా ఆడపులి జాడలేదని ఉజ్జయినీ ఫారెస్ట్ అధికారి బీఎస్ అన్నిగరి చెప్పారు. ఈ మగ పులి దాదాపు చాలా తెలివైందని ఆయన కితాబిచ్చారు. దాదాపు మూడు నెలలుగా జనసంచారంలో తిరుగుతూ కూడా.. ఎవరి కంటికి కనిపించకుండా ఆడ పులి కోసం వెతుకుతోందని చెప్పారు. నగ్దా కొండలనుంచి మొదలైన ప్రయాణం మంగ్లియా, ఇండోర్, బాద్నగర్, ఉజ్జయిని, జవాసియా, ధార్, సరద్‌పూర్, జబువా వరకూ క్షేమంగా ప్రయాణించిందని అన్నారు. ప్రస్తుతం మగపులిని అదుపులోకి తీసుకున్నామని చెప్పిన ఫారెస్ట్ అధికారులు.. త్వరలోనే మరో ఆడపులికి కలుపుతామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలో 2,226 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. -
ఉజ్జయినిలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం ఉజ్జయిని బయల్దేరి వెళ్లారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ' సింహస్థ కుంభమేళాలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు నరేంద్ర మోదీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పన్నెండేళ్ల కొకసారి వచ్చే సింహస్థ కుంభమేళా ఉజ్జయినీలోని క్షిప్రా నది ఒడ్డున జరుగుతున్నవిషయం తెలిసిందే. -
ఉజ్జయినిలో భారీ వర్షాలు!
-
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న విజయమ్మ