2014 నుండి మోదీ ప్రభుత్వంలో ఇది 13వ వరుస బడ్జెట్
మాజీ ప్రధాని మొరార్జీ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్
68 ఏళ్ల క్రితం సీడీ దేశ్‌ముఖ్‌కు మాత్రమే ఈ ఘనత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వరుసగా ఏడవ బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. గతంలో 68 ఏళ్ల క్రితం సీడీ దేశ్‌ముఖ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాదు గత ఏడాది లాగానే బ్రీఫ్ కేసుకు బదులుగా టాబ్లెట్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
మరో విశేషం ఏమిటంటే పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంగళవారం తొలి బడ్జెట్‌ను సమర్పించేందుకు సీతారామన్ ఈసారి కూడా చేనేత చీరనే ఎంచుకున్నారు. తనకోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారం, శక్తికి ప్రతీకతోపాటు, భారతీయ హస్తకళాకారులపట్ల గౌరవంతో కాంట్రాస్టింగ్ పర్పుల్, పింక్ కలర్ బ్లౌజ్‌తో కూడిన తెల్లని గీతల హ్యాండ్లూమ్ చీరను ఎంచుకోవడం విశేషం.. ముఖ్యంగా సామరస్యం, భారతీయ సంస్కృతిలో కొత్త ప్రారంబానికి, స్వచ్ఛతకు సూచికగా వైట్ ఎంచుకున్నట్టు సమాచారం. అలాగే ఈ చీరకు పర్పుల్ కలర్, చేనేత చీర లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది.
పూర్తికాలపు తొలి మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 5, 2019న తొలి బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కాలంలో 2021లో నిర్మలా సీతారామన్ డిజిటల్ బడ్జెట్‌ను పరిచయం చేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'టాబ్లెట్‌ని ఉపయోగించి, పేపర్‌లెస్ ఫార్మాట్‌లో బడ్జెట్‌ను సమర్పించారు. ఇక 2024-25 బ్రీఫ్‌కేస్‌కు బదులుగా రెడ్ క్లాత్ ఫోల్డర్‌ను ఉపయోగించారు.
బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమె భేటీ అయ్యారు. మంత్రి వర్గం ఆమోదం తరువాత రాష్ట్రపతిని కలవడానికి ముందు, నిర్మలా సీతారామన్ తన కార్యాలయం వెలుపల తన అధికారుల బృందంతో సంప్రదాయ ‘బ్రీఫ్‌కేస్’ ఫోటోకు పోజులిచ్చారు. ఈసారి బడ్జెట్‌కు బహి-ఖాతా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment