స్థలదాత సీతమ్మ, స్వర్గీయ సుబ్బారావు
సాక్షి, ఉండ్రాజవరం: సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు బాసటగా ఓ మహిళ భూరి విరాళం అందించింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పీహెచ్‌సీ నిర్మాణానికి దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మ తన వంతుగా రూ.3 కోట్లకుపైగా విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు.
చదవండి: (వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది)
ఈ నెల 21న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు నాడు ఆమె తన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై గురువారం ఆమె మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్థం ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కరరామయ్య, సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణబ్రహ్మానందం, వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు శిరిగిన శివరాధాకృష్ణ, కరుటూరి శివరామకృష్ణ, గూడపాటి చెంచయ్య, శిరిగిన నర్సింహమూర్తి, ముళ్ళపూడి కేశవరావు, ఎం.కృష్ణారావు, ఎం.సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment