'భద్రాద్రిలో నగల మాయంపై విచారణ చేపట్టాలి'
'భద్రాద్రిలో నగల మాయంపై విచారణ చేపట్టాలి'
Published Mon, Aug 22 2016 11:23 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM
హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ నగల అదృశ్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలయాన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. తాను ఈ విషయం మీద తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. వెంటనే ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement