
భద్రాచలం ఆలయ నూతన డిజైన్లను విడుదల చేసిన ప్రభుత్వం
భద్రాచలం: భద్రాచల క్షేత్ర అభివృద్ధికి తొలి అడుగు పడింది. దేవస్థానం అభివృద్ధిలో భాగoగా మాడ వీధుల విస్తరణ, ఇతర పనులకు ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం రూ.60 కోట్లను మంజూరు చేసింది. మాడ వీధుల విస్తరణలో భా గంగా ఇళ్లు, భూములను కోల్పోతున్న వారిని రెవెన్యూ, దేవస్థానం అధికారులు గుర్తించగా.. 45 మందికి రూ.34 కోట్లు పరిహారం అందించాల్సి ఉంది. ఈక్రమంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను అధికారులు గత ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం భూసేకరణ, సర్వే వివరాలు ఆరా తీయడంతో.. నష్టపరిహారం విడుదల కావలసి ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. ఇటీవల భద్రా చలం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి సెతం.. రెండు, మూడు రోజుల్లో భూ నిర్వా సితుల పరిహారం అందుతుందని ప్రకటించారు. మంగళవారం రూ.34 కోట్లు విడుదల చేయగా.. ఏళ్ల తరబడి స్థానికులు, భక్తులు ఎదురుచూస్తున్న భద్రగిరి అభివృద్ధికి తొలి అడుగు పడినట్లయింది. ఈమేరకు 45 మంది నిర్వాసితులతో మంగళవారం ఆర్డీవో దామోదర్‌రావు సమావేశమై నిరభ్యంతర పత్రాలు స్వీకరించారు.
వీరికి బుధవారం నష్టపరిహారం చెక్కులను ఇచ్చే అవకాశముండగా, శ్రీరామనవమి రోజు సీఎం రేవంత్ రెడ్డితో ఆలయ అభివృద్ధి పనులకు శంకు స్థాపన జరిపించేలా సన్నాహాలు చేస్తు న్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యాన భద్రగిరి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆనంద్‌సాయి కొన్ని డిజైన్లను రూపొందించారు. మంగళవారం ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై కొత్త డిజైన్లను విడుదల చేసింది. ఈ డిజైన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.