
ఫిర్యాదు చేయడానికి వచ్చిన వృద్ధ దంపతులు
సాక్షి, నాగోలు(హైదరాబాద్): తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేశాడు. అంతే కాకుండా వేధింపులకు గుర్తి చేస్తున్న తన కుమారుడిపై తల్లి ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం ఎల్‌బీనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... మాన్సూరాబాద్ శ్రీరాంనగర్‌కాలనీ చెందిన కౌసల్యదేవి, లింగయ్య భర్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ముగ్గురి వివాహం జరిగింది. పెద్ద కుమారుడు భార్యాపిల్లలతో మరో ప్రాంతంలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులతో ఉంటూ ఆస్తి కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రెండేళ్లుగా తమను చీకటి గదిలో బంధించి సరిగా తిండి పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. చిన్న కుమారుడు రాజశేఖర్ నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఎల్‌బీనగర్ పోలీసులను వేడుకున్నారు. ఈ మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: మాటల్లో దించి.. మాయచేసి..
Comments
Please login to add a commentAdd a comment