
మహిళా న్యాయవాది దారుణ హత్య
కనేకల్లు : అనంతపురం జిల్లాలో ఓ మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. కనేకల్లు మండలకేంద్రంలో సునీత(32) అనే న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తి బుధవారం సాయంత్రం అత్యంత దారుణంగా హత్య చేశాడు.
సునీత ఇంట్లోనే జిరాక్స్ సెంటర్‌తో పాటు ఇంటర్నెట్ షాపును నిర్వహిస్తోంది. ఆమె షాపులో ఉండగా ఓ వ్యక్తి వేటకొడవలితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.