పున్నేలులో దారుణం:పసివాడి నోట్లో విషపు గుళికలు | Brutally in Punnelu | Sakshi
Sakshi News home page

పున్నేలులో దారుణం:పసివాడి నోట్లో విషపు గుళికలు

Published Mon, Jan 5 2015 8:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

Brutally in Punnelu

వరంగల్: వర్ధన్నపేట మండలం పున్నేలు గ్రామంలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల కారణంగా 5నెలల హర్షవర్ధన్ నోట్లో విషపు గుళికలు పోశారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. రాజు అనే వ్యక్తికి తన సోదరునితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలను దృష్టిలోపెట్టుకొని, తన కక్షని అయిదు నెలల బాబుపై చూపించాడు.

రాజు తమ్ముడు కుమారుడు హర్షవర్ధన్ నోట్లో విషపు గుళికలు వేశాడు. ఆ బాలుడిని ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement