punnelu
-
పున్నేలులో దారుణం:పసివాడి నోట్లో విషపు గుళికలు
వరంగల్: వర్ధన్నపేట మండలం పున్నేలు గ్రామంలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల కారణంగా 5నెలల హర్షవర్ధన్ నోట్లో విషపు గుళికలు పోశారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. రాజు అనే వ్యక్తికి తన సోదరునితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలను దృష్టిలోపెట్టుకొని, తన కక్షని అయిదు నెలల బాబుపై చూపించాడు. రాజు తమ్ముడు కుమారుడు హర్షవర్ధన్ నోట్లో విషపు గుళికలు వేశాడు. ఆ బాలుడిని ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భర్తను వల్లో వేసుకుందని మహిళకు దేహశుద్ధి
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పున్నేలు గ్రామంలో ఓ మహిళను కరెంటు స్థంభానికి కట్టేసి చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. వివాహితుడైన అల్లావుద్దీన్‌ను పెళ్లి చేసుకుందన్న కోపంతో మొదటి భార్య హసీనా బంధువులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ముగ్గురు పిల్లలున్న తన భర్తకు మాయమాటలు చెప్పి నాగమణి వల్లో వేసుకుందని హసీనా ఆరోపించింది. అయితే.. అల్లావుద్దీన్ తనను పెళ్లి చేసుకున్నాడని.. మొదటి భార్యను ఒప్పించి.. కాపురం పెట్టిస్తానని ఇక్కడికి తీసుకొచ్చాడని నాగమణి చెబుతోంది. కాగా గొడవ జరుగుతుండగానే .. అల్లావుద్దీన్ అక్కడి నుంచి పారిపోయాడు. నాగమణిని చితకబాదుతుండగా.. గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగమణిని వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
రెండో పెళ్లి చేసుకుందని చితకబాదిన....