చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాయి. ఓ అన్న తన తమ్ముడి కుటుంబంపై పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు.
గంగవరం: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాయి. ఓ అన్న తన తమ్ముడి కుటుంబంపై పైశాచికంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తమ్ముడు, మరదలు మరణించగా వారి కుమారుడిని తీవ్రంగా గాయపడ్డాడు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన శివకుమార్(38), అతని అన్న ఆనంద్‌కు మధ్య కొన్నాళ్లుగా ఆస్తి విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివకుమార్, అతని భార్య నాగరత్నమ్మ(32) కుమారుడు గంగాధర్‌పై ఆనంద్ ఆదివారం అర్థరాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో శివకుమార్ దంపతులు అక్కడికక్కడే చనిపోగా గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించి గంగాధర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.