ఆస్తి కోసం వదినను చంపిన మరిది | Brother -in- Law marderd Sister -in- Law | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం వదినను చంపిన మరిది

Oct 5 2015 8:00 PM | Updated on Nov 6 2018 4:10 PM

ఆస్తి తగాదాల్లో ఓ వ్యక్తి సొంత వదినను నరికి చంపేశాడు

ఆస్తి తగాదాల్లో ఓ వ్యక్తి సొంత వదినను నరికి చంపేశాడు. కర్నూలు జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక పడమట వీధికి చెందిన బోయ వెంకట లక్ష్మమ్మ(50) భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు.

ఆ దంపతులకు పిల్లల్లేరు. దీంతో వారికి ఉన్న ఆస్తిని తన పిల్లల పేరిట రాసివ్వాలని ఆమె మరిది నర్సింహుడు కొన్ని రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెంకట లక్ష్మమ్మ సోమవారం సాయంత్రం స్థానిక సంతకు వెళ్లి వస్తుండగా నర్సింహుడు ఆమెను గొడ్డలితో నరికాడు.

తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement