సాక్షి, కర్నూలు: కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి హత్య చేశాడు ఓ భర్త. మంత్రాలయం నియోజక వర్గం కోసిగిలో ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కేశవ్‌కు, కోసిగికి చెందిన అనితతో కొన్నేళ్లుగా కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైనప్పటి నుంచి కేశవ్ ఏ పనిచేయకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి గొడవకు దిగిన కేశవ్.. కత్తెరతో భార్య గొంతులో పొడిచి హతమార్చినట్లు తెలుస్తోంది. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వివాహిత హత్యతో స్థానికంగా కోసిగిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment