kosigi
-
పోలీసుల మందలింపుతో యువకుడి ఆత్మహత్య
కోస్గి: పోలీసులు మందలించడంతో ఆందోళనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచకు చెందిన మారుతి (19) డిగ్రీ మధ్యలోనే ఆపి వేసి హైదరాబాద్‌లో పని చేసుకుంటుండేవాడు. అయితే ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడిపి తనకు గర్భం రావడానికి కారణమయ్యాడని అదే గ్రామానికి చెందిన ఓ యువతి (22) తన తల్లితో కలసి ఈనెల 17న పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు రప్పించి ‘అమ్మాయి ని పెళ్లి చేసుకుంటావా.. కేసు పెట్టమంటావా?’అనడంతో భయపడిన మారుతి పెళ్లి చేసుకుంటాన ని అంగీకారపత్రం రాసిచ్చాడు. మరుసటి రోజే సాయిబాబ మందిరంలో పెళ్లి చేసేందుకు ఎస్ఐ నాగరాజు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మారుతి, తాను మైనర్‌నని.. ఆధార్ కార్డులో పుట్టి న తేదీ తప్పుగా నమోదైందని పోలీసులకు తెలిపా డు. దీంతో పాఠశాలలో ఇచ్చిన బోనఫైడ్ సర్టిఫికె ట్ తీసుకురావాలని ఎస్ఐ సూచించడంతో అక్కడినుంచి బయటకు వచ్చిన మారుతి తప్పించుకుని హైదరాబాద్‌కు పారిపోయాడు. ఈ నేపథ్యంలో మారుతిని పోలీసులే వదిలేశారని, ఎలాగైనా అతనితో పెళ్లి చే యాలని యువతి పట్టుబట్టడం తో అతనిపై కేసు నమోదు చేశా రు. ఇది తెలుసుకున్న మారుతి బుధవారం రాత్రి స్వగ్రామాని కి వచ్చి అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. గురువారం ఉదయం అటువైపు వెళ్లిన కొందరు కాలనీవాసులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ వేధింపుల వల్లే బలవన్మరణం ఇదిలా ఉండగా ఎస్ఐ భయపెట్టడం వల్లే మారుతి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి అంజిలయ్య, సోదరుడు రవి ఆరోపించారు.ఎస్ఐ వచ్చే దాకా తీసేదిలేందటూ మృతదేహం వద్దే బైఠాయించారు. దీంతో కోస్గి సీఐ ప్రేమ్‌కుమార్ బాధితులతో మాట్లాడి సమగ్ర విచారణ జరిగిపి బా ధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎస్ఐ నాగ రాజును వివరణ కోరగా, యువతి ఫిర్యాదు మేరకు మారుతిని పిలిపించి విచారించిన మాట వాస్తవమేనన్నారు. అతను మైనర్‌ను కాబట్టి ఏడాది తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోపాటు అమ్మాయి కుటుంబ సభ్యుల ఎదుటే లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడన్నారు. -
కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి..
సాక్షి, కర్నూలు: కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి హత్య చేశాడు ఓ భర్త. మంత్రాలయం నియోజక వర్గం కోసిగిలో ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కేశవ్‌కు, కోసిగికి చెందిన అనితతో కొన్నేళ్లుగా కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైనప్పటి నుంచి కేశవ్ ఏ పనిచేయకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి గొడవకు దిగిన కేశవ్.. కత్తెరతో భార్య గొంతులో పొడిచి హతమార్చినట్లు తెలుస్తోంది. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వివాహిత హత్యతో స్థానికంగా కోసిగిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కోసిగి పోలీసుకు రాష్ట్రస్థాయి పురస్కారం
కోసిగి: స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మధుకుమార్ రాష్ట్ర స్థాయి పౌర సేవా పురస్కార్ అందుకున్నారు. సోమవారం విజయవాడలో డీజీపీ సాంబశివరావు ఈ అవార్డు ప్రదానం చేశారు. మధుకుమార్ శ్రీశైలంలో జరిగిన కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించారు. అక్కడకి వచ్చే వెళ్లే భక్తులకు ఉత్తమ సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ సేవా అవార్డును అందుకున్నారు. ఎమ్మిగనూరుకు చెందిన కాశీమప్ప, గోవిందమ్మల కుమారుడైన ఇతను..2007లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న మధుకుమార్‌ను కోసిగి ఎస్ఐ ఇంతియాజ్ బాషాతో పాటు తోటి కానిస్టేబుళ్లు అభినందించారు. అవార్డు వచ్చేందుకు ప్రోత్సాహం అందించిన జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు, ఇన్చార్జ్ సీఐ దైవప్రసాద్, బదిలీ పై వెళ్లిన బేతంచర్ల సీఐ కంబగిరి రాముడికి మధుకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
25న కోసిగిలో పోస్టల్ మహామేళా
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన కోసిగిలో మహామేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. శనివారం తన చాంబరులో ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహామేళాలో తపాలా శాఖకు సంబంధించిన పథకాలను వినియోగదారులకు పరిచయం చేయడమే కాకుండా తక్షణ సేవలు కూడా అందిస్తామన్నారు. కార్యక్రమానికి పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక, శాసన సభ్యులు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, జయనాగేశ్వరరావుతో పాటు పీఎంజీ సంజీవ్ రంజన్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నట్లు తెలిపారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాను విజయవంతం చేయాలని కోరారు. -
వివాహిత బలవన్మరణం
కోసిగి (కర్నూలు) : కుటుంబ కలహాలకు తోడు భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న విజయ్(30), కవిత(25)లకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసిగిపోయిన కవిత మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగింది. ఇది గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందింది. -
విద్యుదాఘాతంతో బాలిక మృతి
కోసిగి (కర్నూలు జిల్లా) : బోరు దగ్గర నీరు తాగేందుకు వెళ్లిన బాలిక విద్యుదాఘాతానికి బలైంది. ఈ సంఘటన సోమవారం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గోవిందు,లక్ష్మీ దంపతుల రెండవ కుమార్తె రాజమ్మ(15) తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లింది. ఈ క్రమంలోనే పొలం దగ్గర ఉన్న బోరు వద్ద నీరు తాగుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. -
భావోద్వేగాలకు గురికావద్దు
కోసిగి రూరల్ : రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులు జరగకుండా చూస్తామని కలెక్టర్ విజయమోహన్ పేర్కొన్నారు. ఇరు ప్రాంతాల రైతులు భావోద్వేగాలకు గురికాకుండా సహనం పాటించాలని సూచించారు. ఆధునికీకరణ పనులను తిరిగి ప్రారంభిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆర్డీఎస్ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆధునికీకరణ పనుల్లో ఆనకట్ట ఎత్తు పెంచడం లేదన్నారు. అలా పెంచాల్సి వస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని అన్నారు. తన పరిశీలనలో రైతులు, అధికారులు తెలిపిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని చెప్పారు. సీమ రైతులకు అన్యాయం చేయవద్దు.. ఆర్డీఎస్ ఆనకట్టు ఎత్తును పెంచి రాయలసీమ రైతులు, ప్రజలకు ఎలాంటి అన్యాయం చేయవద్దని కలెక్టర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బెట్టనగౌడ్, భీంరెడ్డి, మురళీరెడ్డి కోరారు. ఎత్తు పెంచితే దిగువ ప్రాంతానికి 1500 క్యూసెక్కుల నీటి సరఫరా తగ్గిపోతుందని, అలాగే ఎగువ ప్రాంతంలో 200 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా ఆర్డీఎస్ ఎత్తును పెంచుకోవడానికి నిజాం పాలకులు వీలు కల్పించినట్లు కలెక్టర్‌కు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి వివరిస్తుండగా సీమ రైతులు అడ్డుకున్నారు. సీమ ప్రాంత రైతులకు నీటి కష్టాలు వచ్చేలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సాగు, తాగునీటి వసతి కల్పించాలి తుంగభద్ర నది నుంచి సీమ ప్రాంత వాసులకు తాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోసిగి మండల రైతులు కలెక్టర్ విజయమోహన్‌ను కోరారు. చాలా కాలంగా ఆర్డీఎస్ నుంచి దాగువకు రావాల్సిన నీటి వాటా రాకపోవడంతో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ కాన్వాయ్‌ని అడ్డుకుని చుట్టుముట్టారు. ఎలాంటి సమస్య రాకుండా చూస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు శాంతించి వెనుదిరిగారు. కలెక్టర్ వెంట ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, కోసిగి సీఐ అస్రార్‌బాషా, కోసిగి, పెద్దకడుబూరు మండలాల ఎస్ఐలు కృష్ణమూర్తి, జగన్ మోహన్ యాదవ్ ఉన్నారు. రైతుల ఆందోళనకు కోసిగి వైఎస్సార్సీపీ నాయకులు మంగమ్మ, నాడుగేని నరసింహులు, హోళగుంద కోసిగయ్య, లచ్చప గోవిందు, బండల గోవిందు, ఆకాశ్‌రెడ్డి, దొడ్డి నరసన్న తదితరులు మద్దతు తెలిపారు.