విద్యుదాఘాతంతో బాలిక మృతి | Teenager dies due to Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో బాలిక మృతి

Published Mon, Jun 1 2015 3:12 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Teenager dies due to Electrocution

కోసిగి (కర్నూలు జిల్లా) : బోరు దగ్గర నీరు తాగేందుకు వెళ్లిన బాలిక విద్యుదాఘాతానికి బలైంది. ఈ సంఘటన సోమవారం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గోవిందు,లక్ష్మీ దంపతుల రెండవ  కుమార్తె రాజమ్మ(15) తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లింది. ఈ క్రమంలోనే పొలం దగ్గర ఉన్న బోరు వద్ద నీరు తాగుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement