కోసిగి (కర్నూలు) : కుటుంబ కలహాలకు తోడు భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న విజయ్(30), కవిత(25)లకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసిగిపోయిన కవిత మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగింది. ఇది గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందింది.