25న కోసిగిలో పోస్టల్ మహామేళా
Published Sun, Jan 22 2017 12:41 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన కోసిగిలో మహామేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. శనివారం తన చాంబరులో ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహామేళాలో తపాలా శాఖకు సంబంధించిన పథకాలను వినియోగదారులకు పరిచయం చేయడమే కాకుండా తక్షణ సేవలు కూడా అందిస్తామన్నారు. కార్యక్రమానికి పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక, శాసన సభ్యులు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, జయనాగేశ్వరరావుతో పాటు పీఎంజీ సంజీవ్ రంజన్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నట్లు తెలిపారు. వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాను విజయవంతం చేయాలని కోరారు.
Advertisement
Advertisement