Brother -in- Law
-
Aay Movie Team: అల్లు అర్జున్‌ని కలిసిన ఎన్టీఆర్ బావమరిది (ఫొటోలు)
-
రూ.14 లక్షల సుపారీ.. బావమరిది హత్యకు బావ కుట్ర..
కోరుట్ల: ఆర్థిక లావాదేవీలు.. వృత్తిపరమైన పోటీని తట్టుకోలేక ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి సహా నలుగురు సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసి 2 కార్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు తెలిపారు. బుధవారం కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన ధనకంటి సంపత్(35) ఆర్ఎంపీగా పనిచేసూ్తనే చిట్టీలు, ఫర్నీచర్ షాపు నిర్వహించేవాడు. సంపత్ సొంత బావమరిది, రాయికల్‌కు చెందిన సంకోజి విష్ణువర్ధన్(32) తన బావమరిది అజయ్(28)తో కలిసి చిట్టీలు, ఫర్నీచర్ షాపు నడపడంలో సంపత్‌కు ఆర్థికంగా సాయం చేశాడు. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. ఆర్థిక లావాదేవీల్లో గొడవలు.. ఫర్నీచర్ షాపు, చిట్టీల వ్యవహరంలో సంపత్‌కు అతడి బావమరిది విష్ణువర్ధన్, అజయ్‌కు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వీటితోపాటు తన కుటుంబంలో విష్ణువర్ధన్ తరచూ జోక్యం చేసుకోవడం సంపత్‌కు కంటగింపుగా మారిది. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌తోపాటు అజయ్‌ను అడ్డుతొలగిస్తే అత్తగారి ఆస్తి మొత్తం తనకు కలిసివస్తుందన్న దురాశ సంపత్లో కలిగింది. రెండేళ్ల క్రితం విష్ణువర్ధన్ అనారోగ్యానికి గురికాగా, సంపత్ వైద్యం అందించి కావాలని ఓవర్‌డోస్ ఇంజక్షన్లు ఇచ్చి హత్యకు యత్నించాడు. ఆ తర్వాత విష్ణువర్ధన్ కోలుకోగా తన ప్రయత్నం ఫలించలేదని భావించిన సంపత్.. నాలుగు నెలల క్రితం ఓ హత్యాయత్నం కేసులో నిందితుడైన పైడిమడుగు గ్రామానికి చెందిన క్యాతం శేఖర్(26)ను కలిసి విష్ణువర్ధన్, అజయ్‌తోపాటు వృత్తిలో పోటీగా ఉన్న పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్‌ను హత్య చేయడానికి తనకు సహకరించాలని కోరాడు. రూ.14లక్షల సుపారీకి ఒప్పందం.. క్యాతం శేఖర్ పైడిమడుగుకు చెందిన మేదిని శ్రీకాంత్(28), కోరుట్లకు చెందిన విత్తనాల నాగరాజు(40), ఆకుల అశోక్‌తో కలిసి విష్ణువర్ధన్, అజయ్, రాజేందర్‌ను చంపడానికి రూ.14 లక్షల సుపారీకి సంపత్తో ఒప్పందం చేసుకున్నాడు. తొలుత రాజేందర్‌ను చంపితే రూ.4లక్షలు, తర్వాత విష్ణువర్ధన్, అజయ్‌ను చంపితే మిగిలిన రూ.10 లక్షలు ఇస్తానని సంపత్తో ఒప్పందం చేసుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదిరిన తర్వాత డబ్బులు చెల్లించడంలో సంపత్ జాప్యం చేశాడు. డిసెంబర్ 5వ తేదీన సంపత్తో సుపారీ ఒప్పందం కుదుర్చుకున్న ఆకుల అశోక్, మేదిని శ్రీకాంత్.. హత్య కుట్రలో ఒకరైన పైడిమడుగు ఆర్ఎంపీ రాజేందర్ ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి బయటకు పిలిచారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. దీంతో ఇరుగుపొరు రావడంతో అశోక్, శ్రీకాంత్ అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆర్ఎంపీ రాజేందర్, సంకోజి విష్ణువర్ధన్ ఫిర్యాదు మేరకు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన ఎస్సైలు చిర్ర సతీశ్, శ్యాంరాజ్, సుధీర్‌రావు, రాంచంద్రం.. సుపారీ ఒప్పందం చేసుకుని హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, మేదిని శ్రీకాంత్, ఆకుల అశోక్, విత్తనాల నాగరాజు, క్యాతం శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ, కోరుట్ల సర్కిల్ పరిధిలో పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. సొంత బావమరిదితోపాటు మరో ఇద్దరి హత్యకు కుట్ర పన్నిన దనకంటి సంపత్, సుపారీ గ్యాంగ్ సభ్యుల నుంచి రెండు కార్లు, నాలుగు సెల్పోన్లు స్వా«ధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించి, ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీసులకు రివార్డు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐ వివరించారు. చదవండి: భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు.. -
మేనత్త కూతురిని ఇష్టపడ్డాడు.. నో చెప్పడంతో అర్ధరాత్రి కీర్తనను..
సాక్షి, చెన్నై: మేనత్త కూతురిపై మనస్సు పడ్డ ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. తనతో మాట్లాడటం లేదనే ఆగ్రహంతో ఆ యువతిని నరికి చంపేశాడు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని తిరుబువనం సన్యాసి కుప్పానికి చెందిన నాగరాజ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మయిల్ మరణించడంతో అంబికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు, ఇందులో కీర్తన(19) మూడో కుమార్తె. ఈమె డిగ్రీ చదువుతోంది. కీర్తనపై మయిల్ అన్న కుమారుడు ముఖేష్ మనస్సు పడ్డాడు. అయితే ముఖేష్‌కు మద్యం అలవాటు ఉండడంతో అతడి ప్రేమను కీర్తన తిరస్కరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో కీర్తనను ముఖేష్ అడ్డుకున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె తల వెంట్రుకల్ని కత్తరించేశాడు. తర్వాత ఉడాయించాడు. ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి.. సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై 18 చోట్ల కత్తిగాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. అనంతరం, పరారీలో ఉన్న ముఖేష్ కోసం గాలిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఎస్పీ జిత్తన్ కోదండరామన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది. ఇది కూడా చదవండి: ఆయన నా భర్తే.. రచ్చకెక్కిన నవ్య శ్రీ ఉదంతం.. ఫొటోలు వైరల్ -
ప్రేమ పెళ్లి : బావమరుదుల అఘాయిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువతీ యువకుల హత్యలకు హద్దూ అదుపులేకుండా పోతోంది. తాజాగా హరియాణాలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని, యువతి సోదరులు అతి దారుణంగా హత్య చేశారు. పానిపట్ బిజీ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పరువు పేరుతో ప్రేమికుల వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా హరియాణాలో గత మూడురోజుల్లో ఇది రెండవ హత్య. నీరజ్(23) అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఒక నెలన్నరలోపే కుల దురహంకారానికి బలైపోయాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నీరజ్, తమ సోదరిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో నీరజ్ భార్య సోదరులు కక్ష పెంచుకున్నారు. మాట్లాడాలని పిలిచి మరీ దాడికి తెగబడ్డారు. నీరజ్‌ను కనీసం డజను సార్లు పొడిచి చంపి అక్కడినుంచి పరారయ్యారు.చాలాకాలంగా నిందితులు తన తమ్ముడిని బెదిరిస్తున్నారని, పోలీసుల రక్షణ కోరినా పట్టించుకోలేదని నీరజ్ సోదరుడు జగదీష్ వాపోయారు. దాడికి కొన్ని నిమిషాలు ముందు నీరజ్ భార్యకు ఫోన్ చేసి మరీ త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారనీ, పథకం ప్రకారమే తన సోదరుడిని పొట్టన పెట్టుకున్నారని కన్నీంటి పర్యంత మయ్యాడు. అయితే వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించి, ఇందుకు గ్రామ పంచాయతీ సమావేశంలో లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపాయి, కానీ ఆ మహిళ సోదరులు అంగీకరించలేదనీ, నీరజ్ దంపతులపై బెదరింపులకు పాల్పడ్డారని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ వాట్స్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. -
బీమా డబ్బుల కోసం బామ్మర్ది హత్య!
భిక్కనూరు: రైతుబీమా డబ్బుల కోసం సొంత బామ్మర్దినే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఆగ్రహోదగ్రులయ్యారు. బావతో పాటు మరో ఇద్దరు నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ (21) రామాయంపేట శివారులోని ఓ బావిలో శుక్రవారం శవమై కనిపించాడు. అతడి మృతికి బావ రాజశేఖరే కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు శనివారం గ్రామంలో ఆందోళనకు దిగారు. వారి ఇళ్లపై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆందోళన విరమించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. బీమా డబ్బుల కోసమే శేఖర్‌ను అతని బావ రాజశేఖర్, మరో ఇద్దరు కలసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
సల్మాన్‌ను కొట్టిన వారికి నగదు బహుమతి!
సాక్షి, ముంబై: సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘లవరాత్రి’ సినిమా హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని హిందూ హై ఆజ్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఏర్పాటు చేసిన ‘హిందూ హై ఆజ్’ సంస్థ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ ఓ సంచలన ప్రకటన చేశారు. బహిరంగంగా సల్మాన్ ఖాన్‌ను కొట్టిన వారికి రూ. 2లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. గురువారం ఆగ్రాలోని భగవాన్ థియేటర్లో లవరాత్రి సినిమాకు చెందిన సల్మాన్ ఖాన్ పోస్టర్లను హిందూ హై ఆజ్ కార్యకర్తలు దహనం చేశారు. హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేసేలా ఉందని, కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఈ సినిమా అక్టోబరులో విడుదల కానున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ హీరోగా పరిచయం కాబోతున్నారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. -
ఆ సినిమాను విడుదల కానివ్వం: వీహెచ్‌పీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. ఇదంతా ఎందుకంటారా.. తాజాగా ‘లవోరాత్రి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సల్మాన్ ఖాన్ బావ ఆయుష్ శర్మ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. గుజరాత్లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే సినిమా పేరును ‘లవోరాత్రి’ అని నిర్ణయించారు. ఈ విషయం గురించి విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేశారు. ఈ సినిమాను దేశంలో ఎక్కడా ప్రదర్శించడానికి వీలులేదు. హిందువుల మనోభావాలు దెబ్బతినాలని మేం కోరుకోవడం లేదు. కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటా’మని తెలిపారు. ‘సుల్తాన్’, షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’, చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అభిరాజ్ మినావాలా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయుష్ శర్మకు జోడీగా నటిస్తున్న వారినా హుస్సెన్‌కు కూడా ఇండస్ట్రీకి తొలి పరిచయం కావడం గమనార్హం. -
చందా కొచర్‌కు మరో షాక్
-
చందా కొచర్‌కు మరో షాక్
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ గ్రూపు రుణ వివాదంలో సీబీఐ చురుకుగా కదులుతోంది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందాకొచర్ భర్త, దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నారు. ముంబై విమానాశ్రయంనుంచి సింగపూర్ వెళుతుండగా అతనిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ కేసులో చందాకొచర్ కుటుంబానికి చెందిన సన్నిహితుడిని సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో మరింత విచారణ చేపట్టే క్రమంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకుంది. అతణ్నించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో చందాకొచర్ భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ధూత్పై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ,అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఇంతవరకూ దీపక్‌ను ప్రశ్నించలేదు. కానీ, దీపక్ కొచర్కుచెందిన న్యూపవర్రెన్యువబుల్స్ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. కాగా 2012లో వీడియోకాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల విలువైన రుణాల మంజూరు సందర్భంగా బ్యాంకు సీఈవో చందా కొచర్‌పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తును వ్యతిరేకించింది. కాగా ఈ రుణ వివాదంలోకి తాజాగా దీపక్ సోదరుడు, చందా కొచర్ మరిది.. రాజీవ్ కొచర్‌కి చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్వ్యవస్థీకరణ సేవలు అందించిందనీ, అవిస్టా సేవలు పొందిన వాటిల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, జైప్రకాశ్ పవర్లతో పాటు వీడియోకాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్ తదితర కంపెనీలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని రాజీవ్ కొచర్ ఖండించిన సంగతి తెలిసిందే. భారతీయ బ్యాంకులతో ఎలాంటి సిండికేషన్ ఉండకూడదనే ఒక నియమాన్ని తాము పెట్టుకున్నామన్నారు. ఈక్రమంలో చందా కొచర్ సీఈవోగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇండోనేషియా, దుబాయ్‌లోని కార్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదేదో కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా రాజీవ్ కొచర్ కొట్టిపారేశారు. -
ఆస్తి కోసం మహిళ దారుణ హత్య
మెదక్ మున్సిపాలిటీ : ఆస్తి కోసం అన్న భార్యను తమ్ముడు కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన నంగి బీరమ్మ(44) భర్త ప్రకాశ్ గతంలో మరణించాడు. అయితే వీరికి సంతానం లేకపోవడంతో బీరమ్మ ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకుంటోంది. కాగా బీరమ్మ భర్త ప్రకాష్ తమ్ముడు రాంసురేందర్కు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. బీరమ్మ పేరున ఒక ఎకరంన్నర పొలం ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను దత్తత తీసుకోకుండా ఎక్కడి నుండో పిల్లను తెచ్చుకొని సాకడం ఏంటని రాంసురేందర్ బీరమ్మతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి ముందు బీరమ్మ తను దత్తత తీసుకున్న కూతురు తేజకు అన్నం తినిపిస్తోంది. ఇదే సమయంలో రాంసురేందర్ అక్కడికి కత్తితో వచ్చి బీరమ్మను నరికాడు. దీంతో బీరమ్మ రక్తం మడుగులో కొట్టుకొని అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. వెంటనే రాంసురేందర్ అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ భాస్కర్, క్లూస్‌టీం సహాయంతో వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తీవ్ర ఉద్రిక్తత: ఆస్తి కోసం అన్న భార్యను చంపేయడంతో నవాబుపేట వీధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాంసురేందర్ తన పిల్లలను బీరమ్మ దత్తత తీసుకుంటే ఆమె ఆస్తి కూడా తనకే వచ్చేదని ఆశపడేవాడని స్థానికులు ఆరోపించారు. బీరమ్మ మృతి పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. బీరమ్మ దుర్మరణంతో దత్తత తెచ్చుకున్న చిన్నారి అనా«థగా మారింది. ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడిపెట్టారు. -
బావే హతమార్చాడు
సిద్దిపేటటౌన్: సొంత మరదలిపై కన్నేశాడు.. తనను పెళ్లి చేసుకోవాలని లేదా శారీరకంగా సహకరించాలని వేధించాడు. అయినా వినకపోవడంతో దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. ఒంటరిగా బావి వద్ద ఉందని తెలుసుకొని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. నన్ను కాదని వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడతావా..? నాకు సహకరించవా అంటూ నిలదీయడంతో ప్రతిఘటించిన ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై అనుమానం రాకుండా ఉండడానికి మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ నెల 2న మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన చెట్లకింది సుహాసిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనపై మృతురాలి అక్క మౌనిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చివరికి నిందుతుడిని పట్టుకున్నారు. మంగళవారం సిద్దిపేట అడిషనల్ డీసీపీ జి. నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రుద్రారం గ్రామానికి చెందిన చెట్లకింది సంజీవ్‌కు ఇద్దరు కూతుళ్లు మౌనిక, సుహాసిని. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన గరిగుల అశోక్(27) మౌనికను చూసేందుకు వచ్చి సుహాసిని నచ్చడంతో ఆమెనే పెళ్లి చేసుకుంటానని అందరికి చెప్పాడు. దానికి మౌనిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయిష్టంగానే మౌనికను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి తర్వాత కూడా మరదలైన సుహాసినిని లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో మృతురాలు నిజాంపేటకు చెందిన ఒక వ్యక్తితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్న విషయం అశోక్‌కు నచ్చక ఆమెను మందలించాడు. మరుసటి రోజు బావి వద్ద సుహాసిని ఒక్కతే ఉన్న సమయంలో నిందితుడు అఘాయిత్యం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించి నెట్టేయడంతో కోపోద్రిక్తుడైన అశోక్ సుహాసిని గొంతు బలంగా పట్టుకోవడంతో మృతిచెందింది. దీంతో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న కిరోసిన్‌ను మృతదేహంపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకు నే క్రమంలో డాగ్ స్క్వాడ్ మృతురాలి తండ్రి సంజీవ్ వద్దకు వెళ్లి ఆగిపోయింది. కానీ దీన్ని నమ్మని పోలీసులు సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ నేతృత్వంలో విచారణను వేగవంతం చేసి నిందితుడి కాల్ డేటాను విశ్లేషించగా అసలు విషయం బయటపడిం ది. పోలీసుల విచారణలో నిందితుడు అసలు విష యం ఒప్పుకున్నాడు. నిందితుడిని పట్టుకోవడంలో సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, దుబ్బాక సీఐ నిరంజన్, మిరుదొడ్డి ఎస్సై విజయభాస్కర్, దుబ్బాక ఎస్సై సు భాష్, కానిస్టేబుల్ విష్ణు కీలకంగా వ్యవహరించారని వారిని కమిషనరేట్ తరఫున అభినందించారు. నిందితుడిని చూపుతున్న అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి -
దినకరన్ సోదరి, బావలకు పీటీ వారెంట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సోదరి సీతలాదేవి, బావ ఎస్ఆర్ భాస్కరన్లకు చెన్నై సిబిఐ కోర్టు పీటి వారెంట్ జారీ చేసింది. 2008లో సీతలాదేవి, భాస్కరన్‌లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. విచారణలో ఆధారాలతో సహా నిరూపితం కావడంతో సీతలాదేవికి మూడు, భాస్కరన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను సిబిఐ కోర్టు విధించింది. దీనిపై వారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోగా చుక్కెదురైంది. దీంతో జైలు శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు వారికి అవకాశం కల్పించారు. అయితే, వారు లొంగిపోని దృష్ట్యా చెన్నై సిబిఐ కోర్టు శుక్రవారం సాయంత్రం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దరిని అరెస్టు చేయాలని సిబిఐను ఆదేశించింది. -
ఆస్తి కోసం వదినను చంపిన మరిది
ఆస్తి తగాదాల్లో ఓ వ్యక్తి సొంత వదినను నరికి చంపేశాడు. కర్నూలు జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక పడమట వీధికి చెందిన బోయ వెంకట లక్ష్మమ్మ(50) భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ దంపతులకు పిల్లల్లేరు. దీంతో వారికి ఉన్న ఆస్తిని తన పిల్లల పేరిట రాసివ్వాలని ఆమె మరిది నర్సింహుడు కొన్ని రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెంకట లక్ష్మమ్మ సోమవారం సాయంత్రం స్థానిక సంతకు వెళ్లి వస్తుండగా నర్సింహుడు ఆమెను గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.