
మహబూబ్‌నగర్ : తోడబుట్టిన తమ్ముడు అని ప్రేమకూడా లేదు. ఆస్తి కోసం అన్నదమ్ముల అనుబంధాన్ని మరిచిపోయాడు. ప్రాణం తీస్తే ఆస్తి అంతా తనదే అనుకున్నాడు. అనుకున్నప్రకారం అదునుచూసి తమ్ముడిపై కత్తితో దాడి చేసి నిండు ప్రాణం తీశాడు. వివరాల్లోకి వెళ్తే అచ్చంపేట, ఛత్రపతి కాలనీకి చెందిన శ్రీనివాసులు, నవీన్‌లు అన్నదమ్ములు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి.
దీంతో అన్న శ్రీనివాసులు తమ్ముడు నవీన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదును చూసి కత్తితో తమ్ముడిపై దాడి చేశాడు. ఇరుగు పొరుగు రావడంతో శ్రీనివాసులు పారిపోయాడు. వెంటనే తీవ్రంగా గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment