ఆస్తి వివాదం.. అన్నను నరికేశాడు.. | Person Murder His Brother In Asset Issues | Sakshi
Sakshi News home page

Jun 23 2018 9:39 AM | Updated on Aug 24 2018 2:36 PM

Person Murder His Brother In Asset Issues - Sakshi

సాక్షి, గుంటూరు : ఆస్తి వివాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆస్తి విషయంలో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో చోటుచేసుకుంది. వివరాలివి.. గత కొద్ది రోజులుగా అన్నదమ్ములు ఆస్తి వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే మరొసారి ఆస్తి విషయంలో మాట్లాడుకుంటున్నారు. మాట మాట పెరిగి అది గొడవకు దారితీసింది. 

ఈ నేపథ్యలోనే అన్న గోపాల్‌ను తమ్ముడు గొడ్డలితో నరికాడు. దీంతో అతను రక్తపు మడుగులో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement