asset disputes
-
స్థల వివాదంలో కత్తితో దాడి
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని మిడిగేశి గ్రామంలో ఒక ఆలయ స్థల వివాదం రక్తసిక్తంగా మారింది. దాడుల్లో ఒక వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ ఘోరం గురువారం రాత్రి జరిగింది. కత్తితో విచక్షణారహితంగా దాడి గ్రామంలో దేవాలయానికి చెందిన ఒక ఎకరా పొలంపై వివాదం నడుస్తోంది. ఈ పొలం పక్కనే ఉన్న భూమి కూడా తనదేనని శ్రీధర్ గుప్త గొడవచేసేవాడు. ఇది కోర్టులో ఉండగా రెండు వర్గాలకు చెందినవారు తరచూ గొడవపడేవారు. రాత్రి కూడా ఇలాగే ఘర్షణ జరిగింది. శ్రీధర్ గుప్త కత్తితో విచ్చలవిడిగా దాడి చేయడంతో రామాంజనయ్య (48), శిల్ప (38) అనే ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మల్లికార్జున అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడి మధుగిరిలో చికిత్స చేయించి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ గుప్త, అతని సంబం«దీకులు తమపై దాడి చేశారని మృతుల కుటుంబీకులు తెలిపారు. ఎస్పీ పరిశీలన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ కుమార్ శహాపూర్వాడ్ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మధుగిరి ఆస్పత్రికి తరలించారు. మిడిగేశి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు శ్రీధర్ గుప్త పరారీలో ఉన్నాడు. (చదవండి: 18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగాజలం జల్లుతూ..!) -
ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదని ...కన్న తండ్రి గొంతు కోసి నిప్పంటించి..
ఆగ్రా: ఆస్తులు తగాదాలు కుటుంబాలను ఎంతలా విచ్ఛిన్నం చేస్తాయో చెప్పనవసరం లేదు. పైగా ఆస్తి విషయంలో మనుషులు కూడా తన పర భేదం మరిచి అత్యంత హేయంగా ప్రవర్తిస్తుంటారు. ఆ క్రమంలో తమ జీవితాలను కటకటాల పాలు చేసుకునేవారు కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వినిత్ కుమార్ అనే వ్యక్తి గత రెండు రోజులుగా ఇంటి విషయమై తండ్రితో గొడవ పడుతున్నాడు. అయితే తండ్రి ఇల్లు అమ్మడానికి నిరాకరించాడు. దీంతో కోపం పెంచుకున్న వినిత్ కుమార్ కన్నతండ్రిని గొంతు కోసి చంపాడు. అతను అక్కడితో ఆగకుండా తండ్రి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కాల్చేశాడు. అయితే స్థానికులు సమాచారం అందిచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అని చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక నిందుతుడు నేరం చేసినట్లు అంగీకరించాడని కూడా చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మృతుడి భార్య ఆశాదేవి తన కుమార్తెతో కలిసి ఆగ్రాలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందని తెలిపారు. (చదవండి: జీవనాధారం కోల్పోయి.. ఊపిరి తీసుకున్న ఆటో డ్రైవర్) -
కొడుకుల కిరాతకం!..డబ్బే ముఖ్యం.. తండ్రి హతం
కర్ణాటక(మండ్య): స్థలం అమ్మిన డబ్బులను పంచుకోవడంతో గొడవ జరిగి ఇద్దరు కుమారులు కన్న తండ్రిని దారుణంగా పొడిచి చంపిన దారుణం మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు మరికాళయ్య (60) కాగా కిరాతక కొడుకులు శశికుమార్, రాజేష్. ఇటీవల మరికాళయ్య ఒక ఎకరా భూమిని రూ.30 లక్షలకు అమ్మాడు. తలా రూ.10 లక్షలు తీసుకుందామని చెప్పాడు. కానీ కొడుకులు ముందే భూ కొనుగోలుదారుతో మాట్లాడి డబ్బు మొత్తం తమకే ఇచ్చేలా మాట్లాడుకున్నారు. దీంతో తండ్రి భూ రిజి స్ట్రేషన్‌కు సంతకం పెట్టలేదు. శుక్రవారం వారు తండ్రితో తీవ్రంగా గొడవపడి కత్తులతో పొడిచి పరారయ్యారు. బంధువులు మరికాళయ్యను మైసూరు ఆస్పత్రికి తరలించగా శనివారం మరణించాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఆస్తి కోసం కన్నతండ్రినే కడతేర్చేందుకు యత్నం!...ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపి పరారైన కొడుకు
మైసూరు: ఆస్తి కోసం తండ్రిని కన్నకొడుకు ఎయిర్‌గన్‌తో షూట్ చేసి పరారైన సంఘటన మైసూరు విజయనగర పరిధిలో చోటు చేసుకుంది. రేణుకా కళాశాలకు చెందిన ఆస్తి విషయంలో నెల రోజులుగా శివకుమార్, కొడుకు మధ్య రగడ జరుగుతోంది. ఆస్తిని తన పేరుమీద రాయాలని తండ్రితో గొడవ పడ్డాడు. స్నేహితులతో కలిసి ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ శబ్దాలకు చుట్టుపక్కల వారు వచ్చి గాయపడిన శివకుమార్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొడుకు, మిత్రులు పరారీలో ఉన్నారు -
సినిమాను మించిన మర్డర్: మూడు హత్యలతో ఉలిక్కిపడిన వరంగల్
అంతా.. 15 నిమిషాల్లోనే జరిగిపోయింది. పదునైన వేటకొడవళ్లు, ఎలక్ట్రిక్ రంపం.. మూడు హత్యలు.. ఒకరకంగా అతను ఊచకోత కోశాడు. కొత్త ఇల్లు రక్తసిక్తమైంది. వరంగల్నగరం ఎల్బీనగర్లో తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన చాంద్ పాషా, అతడి భార్య సాబీరా, బావమరిది ఖలీల్‌ను కేవలం నిమిషాల వ్యవధిలోనే వరుసబెట్టి నిందితుడు ఎండీ షఫీ హతమార్చాడు. 2.20 నుంచి 2.35 నిమిషాల వ్యవధిలోనే మూడు హత్యలు జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉలిక్కిపడింది. సాక్షి, వరంగల్ / ఎంజీఎం/ వరంగల్ క్రైం: తల్లిదండ్రులను తన కళ్లెదుటే కత్తులతో నరకడం.. అడ్డుకోబోయిన మేనమామను క్షణాల్లో మట్టుబెట్టడం.. తోడబుట్టిన తమ్ముళ్లపై పైశాచికంగా కత్తులతో దాడి చేయడం చూసిన ఆ యువతి గుండె పగిలిపోయింది.. కాపాడండి అంటూ ఆ క్షణం గొంతెత్తి అరిచింది. ఒక పక్క తల్లిదండ్రులు, మేనమామ రక్తం మడుగులో కొట్టుకొంటుకుంటుగా తమ్ముళ్ల రోదనలు చెవుల్లో మార్మోగాయి. బాబాయ్ వెంట వచ్చిన కిరాయి గుండాలు రక్త బీభత్సం సృష్టించి బయట పడ్డారు. వరంగల్ ఎల్బీనగర్లో జరిగిన దారుణ హత్య సంఘటనతో నగరంతోపాటు ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొత్త ఇల్లే హత్యకు కారణమైందా? చాంద్‌పాషా, షఫీ అన్నదమ్ములు. 20 ఏళ్లుగా పశువుల క్రయ విక్రయాలు చేస్తూ గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వ్యాపారంలో సుమారు రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఇందులో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్‌పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. రెండు, మూడుసార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగినా.. లావాదేవీలు షఫీ చూసేవాడని, అతనే కట్టాలని చాంద్‌పాషా చెప్పుకొచ్చాడు. ఎల్బీనగర్లో సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్‌పాషా ఏడాది కిందట కొత్త ఇంటిని నిర్మించాడు. అన్న తనకు అప్పులు వేసి, అతను మాత్రం డబ్బులు లేవంటూనే కోటి రూపాయలతో కొత్త ఇల్లు ఎలా కట్టుకున్నాడు. తనను మోసం చేసి డబ్బులు మిగుల్చుకున్నాడని కోపం పెంచుకున్నాడు. తనకు అప్పుల భారం తీవ్రమైందని, ఆదుకోవాలని అన్నావదినలను కోరినా వారు వినకపోవడంతో కోపం కాస్త కసిగా మారి హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. చనిపోయారని వెళ్లిపోయారు.. చాంద్‌పాషా, సాబీరా, ఖలీల్‌లను చంపాక చాంద్‌పాషా కుమారులు సమద్, ఫహాద్‌లు వచ్చారు. వారిని కూడా విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో పడిపోవడంతో చనిపోయారని భావించి వెళ్లిపోయారు. కానీ ఆ తరువాత వారిలో చలనం ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దాడిలో పాల్గొన్నది స్నేహితులే.. ముగ్గురి హత్యలో పాల్గొన్న వారిలో ప్రధాన నిందితుడు షఫీకి సంబంధించిన స్నేహితులు, సేవకులు ఉన్నట్లు సమాచారం. వీరికి, చాంద్‌పాషాకు చాలాఏళ్లుగా పరిచయం కూడా ఉన్నట్లు సమాచారం. వీరి పశువులు, మాంసం వ్యాపారంలో సుమారు 10 సంవత్సరాల పైన పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు షఫీ డ్రైవర్ కూడా ఈ హత్యల సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు. చాంద్‌పాషా ఇల్లు కట్టుకునే సమయంలో నిందితుడు షఫీ దగ్గర ఉండి కట్టించాడు. ఆ ఇంట్లో అణువణువూ అతనికి తెలుసు. హత్య ఘటనలో పాల్గొన్న వారిలో ఒకరు పరకాల ప్రాంతానికి చెందిన నిందితుడు ఉండగా, మరొకరు నర్సంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైంది.. చాంద్‌పాషా (50), సాబీరా (42) (భార్య), ఖలీల్ (40) చాంద్‌పాషా బావమరిది క్షతగాత్రులు: చాంద్‌పాషా కుమారులు సమద్(21), ఫహాద్ (28) క్షణాల్లో ప్రాణాలు పోయాయి.. దుండగులు కత్తులతోపాటు దాడిలో రంపాన్ని వినియోగించడం వల్ల ఆ.. ముగ్గురు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయారు. చాంద్‌పాషా మెడను రంపంతో కోశారు. భుజాలు, చేతులపై పదునైన కత్తిపోట్లు ఉన్నాయి. మెడ భాగం పూర్తిగా కట్ అయి ఉంది. ముఖంపై పడిన కత్తిపోటుతో ముక్కు వరకు తెగింది. ఖలీల్‌పాషాకు గొంతు దగ్గర రంపంతో కోశారు. తల.. మొండం వేరు పడలేదు కానీ రెండింటి మధ్య పెద్ద ఖాళీ స్థలం ఏర్పడింది. చిన్నపాటి కాలువ మాదిరిగా మృత దేహాలపై గుర్తులు ఉండిపోయాయి. సాబీరా బేగం ముఖంపై పదునైన కత్తిపోటు పడింది. మెడపై రంపంతో కోసినట్లు ఉంది. ముగ్గురి మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రి లో బుధవారం పోస్టుమార్టం నిర్వహించా రు. చాంద్‌పాషా కూతురు రూబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ దగ్గు మల్లేష్ తెలిపారు. నింది తులపై 302, 307, 460 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు ఘటనలో గాయపడి ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమద్, ఫహాద్‌ను సోదరి రూబీనా బేగం స్థానికులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తరలించారు. ఎప్పుడు ఏమి జరిగిందంటే.. మంగళవారం అర్ధరాత్రి 1.45 : షఫీతోపాటు స్నేహితులు పీకల దాకా మద్యం తాగారు. 2.05 : ఆటోలో అందరూ ఎల్బీనగర్కు చేరుకున్నారు. 2.05 నుంచి 2.20 : ఎలక్ట్రిక్ రంపంతో చాంద్‌పాషా ఇంటి తలుపుల కింది భాగంలో సగం వరకు షఫీ కోశాడు. 2.20 : రంపం శబ్దం విని నిద్ర నుంచి లేచివచ్చిన చాంద్‌పాషా ఛాతిపై రఫీ రంపంతో కోశాడు. పదునైన కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత శరీరంలోకి పలుమార్లు కత్తితో పొడిచాడు. 2.23 : నిద్ర నుంచి లేచి అడ్డుకోబోయిన బావమరిది ఖలీల్ శరీరం ముందు భాగంలోకి పలుమార్లు పొడిచాడు. ఇలా దాదాపు రెండు నిమిషాల పాటు ఖలీల్‌ను విచక్షణారహితంగా నరికాడు. 2.25 : వీరి అరుపులు విని నిద్రలేచిన వదిన సాబీరాను కూడా పదునైన కత్తితో పొడిచి చంపాడు. 2.28 : ఈ రక్తపు మడుగుల్లో పడి ఆర్తనాదాలు చేస్తుండగా చాంద్‌పాషా కుమారులు సమద్, ఫహాద్‌లు లేచి వచ్చారు. వారిపై అదే పదునైన కత్తితో పొడిచాడు. దీంతో కుప్పకూలిపోయారు. 2.35 : షఫీతోపాటు నిందితులు వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్లిపోయారు. -
దారుణం : తండ్రీ కొడుకులను కొట్టిచంపి.. ఆపై
సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను దుండగులు మాటువేసి హతమార్చారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టి చంపి ఆపై కాల్చివేశారు. ఈ ఘటన డుంబ్రిగూడ మండలం కోచిగూడలో చోటుచేసుకుంది. వివరాలు.. కోచిగూడకు చెందిన తండ్రీకొడుకులు గమ్మిలి మోహనరావు, అప్పారావు బైక్‌పై పొరుగూరికి వెళ్తుండగా దారికాసిన ఇద్దరు వ్యక్తులు వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. అనంతరం వారికి నిప్పు పెట్టి బూడిద చేశారు. ఈ ఘటనకు ఆస్తి తగాదా కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల గ్రామానికి చెందిన గమ్మిల అర్జున్, డొంబు ఈ హత్యలు చేసి ఉండొచ్చిని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆస్తి వివాదం.. అన్నను నరికేశాడు..
సాక్షి, గుంటూరు : ఆస్తి వివాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆస్తి విషయంలో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో చోటుచేసుకుంది. వివరాలివి.. గత కొద్ది రోజులుగా అన్నదమ్ములు ఆస్తి వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే మరొసారి ఆస్తి విషయంలో మాట్లాడుకుంటున్నారు. మాట మాట పెరిగి అది గొడవకు దారితీసింది. ఈ నేపథ్యలోనే అన్న గోపాల్‌ను తమ్ముడు గొడ్డలితో నరికాడు. దీంతో అతను రక్తపు మడుగులో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తల్లీ, కూతుళ్లు దారుణ హత్య
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గౌరు నాగమణి(40), ఆమె కూతరు కొట్టె సాయి లక్ష్మి(20)లు దారుణ హత్యకు గురయ్యారు. నాగమణి మరిది హనుమంతరావు ఇద్దరినీ రోకలిబండతో మోది హత్య చేశాడు. ఆస్తివివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.