దారుణం : తండ్రీ కొడుకులను కొట్టిచంపి.. ఆపై | Father And Son Murdered In Dumbriguda In Vizag | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 25 2018 9:06 AM | Last Updated on Thu, Oct 25 2018 11:43 AM

Father And Son Murdered In Dumbriguda In Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం :  ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకులను దుండగులు మాటువేసి హతమార్చారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టి చంపి ఆపై కాల్చివేశారు. ఈ ఘటన డుంబ్రిగూడ మండలం కోచిగూడలో చోటుచేసుకుంది. వివరాలు.. కోచిగూడకు చెందిన తండ్రీకొడుకులు గమ్మిలి మోహనరావు, అప్పారావు బైక్‌పై పొరుగూరికి వెళ్తుండగా దారికాసిన ఇద్దరు వ్యక్తులు వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. అనంతరం వారికి నిప్పు పెట్టి బూడిద చేశారు. ఈ ఘటనకు ఆస్తి తగాదా కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల గ్రామానికి చెందిన గమ్మిల అర్జున్‌, డొంబు ఈ హత్యలు చేసి ఉండొచ్చిని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement