
కర్ణాటక(మండ్య): స్థలం అమ్మిన డబ్బులను పంచుకోవడంతో గొడవ జరిగి ఇద్దరు కుమారులు కన్న తండ్రిని దారుణంగా పొడిచి చంపిన దారుణం మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు మరికాళయ్య (60) కాగా కిరాతక కొడుకులు శశికుమార్, రాజేష్. ఇటీవల మరికాళయ్య ఒక ఎకరా భూమిని రూ.30 లక్షలకు అమ్మాడు. తలా రూ.10 లక్షలు తీసుకుందామని చెప్పాడు.
కానీ కొడుకులు ముందే భూ కొనుగోలుదారుతో మాట్లాడి డబ్బు మొత్తం తమకే ఇచ్చేలా మాట్లాడుకున్నారు. దీంతో తండ్రి భూ రిజి స్ట్రేషన్‌కు సంతకం పెట్టలేదు. శుక్రవారం వారు తండ్రితో తీవ్రంగా గొడవపడి కత్తులతో పొడిచి పరారయ్యారు. బంధువులు మరికాళయ్యను మైసూరు ఆస్పత్రికి తరలించగా శనివారం మరణించాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment