
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని కన్నతండ్రినే కూతురు కడతేర్చింది. ప్రియుడితో కలిసి హత్య చేసి ఆస్తి వివాదమే హత్యకు కారణమని నాటకం ఆడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించి కూతురుతో పాటు ప్రియుడిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మహబూబాబాద్ మండలం వేమునూరులో కన్నతండ్రి పట్ల మైనర్ అయిన కూతురు ప్రభావతి కసాయిలా వ్యవహరించింది. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో ప్రేమలో పడి ప్రియుడితో కలిసి కన్నతండ్రి వెంకన్నను దారుణంగా కొట్టి చంపింది.
కేసు నుంచి ప్రియుడిని తప్పించేందుకు ఆస్తి వివాదంతో పాటు తాగొచ్చి నిత్యం వేధించడంతోనే తండ్రిని చంపినట్టు స్థానికులతో పాటు పోలీసులకు తెలిపింది. పోలీసులు ప్రభావతిని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పింది. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడనే కోపంతో ప్రియుడితో కలిసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో వెల్లడించింది. దీంతో పోలీసులు కూతురుతో పాటు ఆమె ప్రియుడిపై హత్య కేసు నమోదు చేశారు.
ఇద్దర్ని అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఆస్తి విషయంలో గోడవ జరిగినట్లు ముందుగా ఫిర్యాదు చేశారని సీఐ రవికుమార్ తెలిపారు. ఒక్కరే హత్య చేశారా?.. ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా?.. అనే విషయంపై సమగ్ర విచారణ జరుపగా ప్రేమ పెళ్ళి విషయంలో తండ్రితో గొడవపడి ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment