Father Kills His Daughter In Visakhapatnam Over Love Affair, Selfie Video Goes Viral - Sakshi
Sakshi News home page

Visakhapatnam: ప్రేమించొద్దని చెప్పినా వినలేదని.. కూతురును కడతేర్చిన తండ్రి.. సెల్ఫీ వీడియో వైరల్‌

Published Sat, Nov 5 2022 8:25 AM | Last Updated on Sat, Nov 5 2022 10:05 AM

Father Who Assassination His Daughter In Visakhapatnam - Sakshi

లిఖితశ్రీ (ఫైల్‌)- తండ్రి వరప్రసాద్‌ (ఫైల్‌)

అల్లిపురం (విశాఖ దక్షిణ)విశాఖపట్నం: ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పినా వినలేదని కన్న కూతురిని తండ్రి హత్యచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమెను హత్యచేసిన అనంతరం తన కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో నిందితుడు పోస్టుచేశాడు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి రెల్లివీధిలో శుక్రవారం సాయంత్రం ఈ ఘోరం చోటుచేసుకుంది.
చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ కేజీహెచ్‌ డౌన్‌లోని రెల్లివీధిలో నివాసం ఉంటున్న వడ్డాది వరప్రసాద్‌ కేజీహెచ్‌ మహాప్రస్థానం వ్యాను డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. అతని భార్య వీరిని వదిలేసి వెళ్లిపోయింది. కూతుళ్లను వరప్రసాదే పెంచి పెద్దచేశాడు. పెద్ద కుమార్తె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. రెండో కుమార్తె లిఖితశ్రీ (16) టెన్త్‌ చదువుతోంది. ఆమెను బాగా చదివించాలని తండ్రి ఆశపడ్డాడు.

ఆమెకు కరాటే నేర్పించాడు. కానీ, ఈమె కూడా ఓ యువకుడితో ప్రేమలో పడిందని వరప్రసాద్‌ తెలుసుకున్నాడు. అతనితో తిరగొద్దని ఆమెను వారించాడు. ఆమె వినకపోవడంతో ఆగ్రహించిన తండ్రి శుక్రవారం ఆమెను కొట్టి, పీక నులిమి చంపేశాడు. వరప్రసాద్‌ తల్లి వర్థంతి రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ విషయాన్ని అతను ఫేస్‌బుక్‌లో పోస్టుచేసిన వీడియోలో తెలిపాడు. కూతురిని చంపిన తర్వాత వరప్రసాద్‌ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కానీ, వారు మాత్రం నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement