సాక్షి, ఖమ్మం : మానవత్వం రోజురోజుకీ మంటగలిసి పోతుంది. రక్త సంబంధాలు కూడా మరిచిపోయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. విలువలు, వరుసలు మరిచి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం తలదించుకునే ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా యువతిపై తోడబుట్టిన సోదరులే బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే సోదరులు ఇలా తనపై అత్యాచారానికి ఒడిగడుతున్నారని తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. అంతేగాక నిందితులకు తన తల్లి, పెద్దమ్మ కూడా సహకరించారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగు చూసుంది.
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్‌లో సొంత చెల్లిపై అన్నతోపాటు పెద్దమ్మ కొడుకు బలవంతంగా లైంగిక దాడి చేశారు. గత కొన్ని నెలల నుంచి చెల్లిని చిత్రహింసలు పెడుతూ వచ్చారు. అన్నలు ఇబ్బందులు పెడుతున్న విషయం మా అమ్మకు, పెద్దమ్మ, పెద్దనాన్నకు చెప్పానని, అయిన వారు పట్టించుకోకపోగా వారికే సపోర్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలిస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేస్తానని చెప్పినప్పుడల్లా తనను చంపుతానని బెదిరించేవారని దీంతో పోలీసులకు చెప్పలేకపోయానని వాపోయింది. తన తండ్రి లేకపోవడతో అలుసుగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పుకోచ్చింది. రోజు రోజుకు అన్న చిత్రహింసలు భరించలేక కొత్తగూడెం టూ టౌన్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ దారుణ విషయం బయటపడటంతో లైంగిక దాడి చేసిన పెద్దమ్మ కొడుకు ఇంట్లో ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.
సొంత చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆత్మహత్య
Published Wed, Apr 7 2021 10:55 AM | Last Updated on Wed, Apr 7 2021 3:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment