విందు భోజనం వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో కలుషిత ఆహారం తిని వివాహ వేడుకలకు హాజరైన అతిథులు ఆస్పత్రి పాలయ్యారు.
మథుర: విందు భోజనం వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో కలుషిత ఆహారం తిని వివాహ వేడుకలకు హాజరైన అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. దాస్బిసా గ్రామంలో పెళ్లి వేడుకకు హాజరై, భోజనం చేసిన వెంటనే పలువురు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.
మరోవైపు సమీపంలోని సత్బిసా గ్రామంలోనూ పెళ్లి విందు ఆరగించి అస్వస్థతకు గురి కావటంతో వీరిలో 200 మందిని చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి సిబ్బందిని హుటాహుటిన రప్పించారు. మిగితా 300 మందికి ప్రమాదమేమీ లేకపోవడంతో మందులు వాడాలని సూచించారు.
మరోవైపు ఆహారపదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించినట్టు అధికారులు తెలిపారు. పెళ్లిళ్ల వంటలు చేసేటప్పుడు ఉపయోగించే పదార్ధాలు, కూరగాయలను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వివేక్ మిశ్రా సూచించారు.