అన్నదమ్ముల మధ్య ఘర్షణ
Published Sun, Feb 12 2017 11:30 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
- ఆస్థి పంపకం విషయంలో అన్నపై దాడి
- ఎం. తిమ్మాపురంలో ఘటన
ఎం.తిమ్మాపురం(మహానంది): పొలం పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ చివరకు తమ్ముడు, ఆయన వర్గీయులు అన్నపై వేటకొడవళ్లతో దాడి చేసేవరకు వచ్చింది. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహానంది ఎస్‌ఐ జి.పెద్దయ్యనాయుడు వివరాల మేరకు...తిమ్మాపురానికి చెందిన వి.వీరారెడ్డి, ఆయన అన్న వి.కామేశ్వరరెడ్డి మధ్య పొలం పంపకం విషయంలో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో ఆదివారం అన్న కామేశ్వరెడ్డి ఇంటి వద్ద ఉండగా తమ్ముడు వీరారెడ్డితో పాటు ఆయన వర్గీయులు శ్రీను, కిట్టు మరి కొందరు వెళ్లి గొడవకు దిగారు. ఇది మరింత తీవ్రం కావడంతో తమ్ముడు, ఆయన వర్గీయులు కామేశ్వరెడ్డిపై వేటకొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో కామేశ్వరరెడ్డిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, మహానంది ఎస్‌ఐ జి.పెద్దయ్యనాయుడు నంద్యాల ఆస్పత్రికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. కర్నూలు నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఘటనా స్థలం వద్ద ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేశామని తెలిపారు. . దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Advertisement
Advertisement