
తమ్ముడి ఆత్మహత్యకు తానే కారణమని భావించిన వెంకటేష్ తాను కూడా సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సాక్షి, మైసూరు: అన్న మందలించాడని మనస్తాపంతో తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా తమ్ముడు మరణాన్ని జీర్ణించుకోలేక అన్న కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. హెడీకోటే తాలుకాల ఎలెగుండి గ్రామానికి చెందిన వెంకటేష్(28), హరీశ్(26), అన్నదమ్ములు. ఇద్దరు రైతులు. తమ్ముడు హరీశ్ ఇటీవల ట్రాక్టర్‌ను వేగంగా నడపడంతో వెంకటేష్‌తోపాటు అతని తండ్రి మందలించారు. ఆవేదనకు లోనైన హరీశ్ గురువారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడి ఆత్మహత్యకు తానే కారణమని భావించిన వెంకటేష్ తాను కూడా సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: