
ప్రదీప్(ఫైల్)
సాక్షి, బెంగళూరు: మైసూరుకు చెందిన జేడీఎస్ నాయకుడు శివమూర్తి, జెడ్పీ మాజీ అధ్యక్షురాలు భాగ్య దంపతుల కుమారుడు ప్రదీప్(32)ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని మరటిక్యాతనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌లో ఈఘటన చోటు చేసుకుంది. ప్రదీప్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మైసూరు నగరంలో పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న అవివాహితతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమెకు ఇటీవల గర్భం రావడంతో వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం.
చదవండి: ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్‌నే పాడు చేశాడు!!
తనకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నందున పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. మద్యం మత్తులో గురువారం ఇంటికి చేరుకొని తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇవాళ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: కేపీహెచ్‌బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి
Comments
Please login to add a commentAdd a comment