
క్రీడాంశాలతో సినిమాలు మంచిదే: అక్షయ్
క్రీడలపై చిత్రాలు రావడం ఆహ్వానించదగిన విషయం అని ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు.
ముంబయి: క్రీడలపై చిత్రాలు రావడం ఆహ్వానించదగిన విషయం అని ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. ఇలాంటి చిత్రాలు రావడంతో ప్రజల్లో ఒక్క క్రికెట్పైనే కాకుండా మిగితా క్రీడలపై కూడా మక్కువ పెరుగుతుందని, ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల బాలీవుడ్ చిత్రాల్లో క్రీడలు ప్రధానంగా తెరకెక్కిన చిత్రాలు విజయవంతమైన విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా అక్షయ్ కుమార్ బ్రదర్స్ సినిమాలో బాక్సింగ్ రింగ్లో కనిపిస్తుండగా, వచ్చే ఏడాది రెజ్లింగ్ బాయ్గా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రంలో అలరించనున్నారు. ఈ నేపథ్యంలో క్రీడల నేపథ్యంలో బాలీవుడ్ చిత్రాలు రావడంపై అక్షయ్ను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. కబడ్డీ, హాకీ వంటి క్రీడల కథాంశాలతో కూడా త్వరలో చిత్రాలు రాబోతున్నాయని తెలిపారు. అక్షయ్ కుమార్ నటించిన బ్రదర్స్ చిత్రం ఆగస్టు 14న విడుదల కానున్న విషయం తెలిసిందే.