
ప్రతీకాత్మక చిత్రం
విశాఖ జిల్లా సీలేరు మండలం తోకరాయి గ్రామంలో ఓ తమ్ముడు.. అన్న గుండెలో నాటు బాణం దించాడు.
విశాఖపట్నం (సీలేరు) : విశాఖ జిల్లా సీలేరు మండలం తోకరాయి గ్రామంలో ఓ తమ్ముడు.. అన్న గుండెలో నాటు బాణం దించాడు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అన్నను హుటాహుటిన విశాఖ కేజీహెచ్కు తరలించారు. అయితే ఆ తమ్ముడికి మతిస్థిమితం లేదు. ఇంట్లో ఉన్న నాటు బాణాల్ని తీసుకుని వచ్చే పోయే వాళ్ల మీద తరుచూ విసురుతుంటాడు. అలానే ఆదివారం తన అన్న మీద బాణం విసిరాడు. జరిగిన సంఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్తుల్లో కొంత మంది అతన్ని ఒక గదిలో బంధించి కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని మరికొంత మంది అడ్డుకోవడంతో తమ్ముడు బతికి బయటపడ్డాడు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమవటంతో పోలీసులు ఆ ఊర్లోకి వెళ్లడానికి సంకోచిస్తున్నారు. కాగా అన్నదమ్ములకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.