అందరి మధ్య రాళ్లతో కొట్టి చంపారు | Tamil Nadu Brothers Arrested After Gory Pictures of Alleged Murder | Sakshi
Sakshi News home page

అందరి మధ్య రాళ్లతో కొట్టి చంపారు

Published Mon, Sep 7 2015 11:37 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

అందరి మధ్య రాళ్లతో కొట్టి చంపారు - Sakshi

అందరి మధ్య రాళ్లతో కొట్టి చంపారు

చెన్నై: తమిళనాడులో వెల్లోర్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై చుట్టూ జనం చూస్తుండగా వారి మధ్యలో నిల్చుని ఇద్దరు వ్యక్తులు మహాలింగం అనే వ్యక్తిని అతి క్రూరంగా బండరాయితో కొట్టికొట్టి చంపేశారు. దీంతో అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు. ఏ ఒక్కరూ ఈ హత్యకు పాల్పడుతున్న వ్యక్తులను ఆపేందుకు ప్రయత్నించలేదు. ఆ దృశ్యాలను హత్యకు పాల్పడుతున్నవారికి సంబంధించినవారే ఫొటోలు తీయగా వాటి ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాత కక్షల నేపథ్యంలోనే అతడిని వారు హత్య చేసినట్లు తెలిసింది. వారిద్దరు కూడా స్థానిక ఇంజినీరింగ్ కాలేజీ యజమాని కుమారులని, వారికి ఒక ముఠా కూడా ఉంది. అయితే, మహాలింగం పాత నేరస్థుడని, తమ అంకుల్ని హత్య చేసిన నేపథ్యంలోనే  అతడిని వారిద్దరు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement