ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు హీరోలు. తమిళ హీరో సూర్య ఒక అడుగు ముందుకేసి నెక్స్‌ట సినిమానే కాకుండా ఆ తర్వాతి చిత్రాన్ని కూడా ఓకే చేశారు అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘తానా సేందకూట్టమ్’ (తెలుగులో ‘గ్యాంగ్’)లో చేస్తోన్న సూర్య తదుపరి చిత్రాన్ని దర్శకుడు సెల్వ రాఘవన్‌తో చేయనున్నారు.
ఆ తర్వాత కెమెరామేన్ నుంచి దర్శకుడిగా మారిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇదివరకు వీరి కాంబినేషన్‌లో ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి చిత్రాలు వచ్చాయి. అవిభక్త కవలలు కాన్సెప్ట్‌తో ‘బ్రదర్స్’ సినిమా ఉంటుంది. ఈసారి కూడా సూర్య, ఆనంద్ ఒక ప్రయోగాత్మక చిత్రంతోనే హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నారని చైన్నై టాక్.
Comments
Please login to add a commentAdd a comment