
ఆదిలాబాద్: ఈ నెల 15న వడూర్ గ్రామంలో అన్నదమ్ముల మధ్య గొడవలో వారిని సముదాయించే యత్నంలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు కందకూరి ప్రశాంత్ తండ్రి నర్సింగ్ ఈనెల 16న ఫిర్యాదు చేయగా బామిని గంగాధర్, పవన్‌కళ్యాణ్‌ను 17న వడూర్ బస్‌స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అన్నదమ్ములు వారి సోదరికి తులం బంగారం విషయమై గొడవ పడుతుండగా, ప్రశాంత్ ఆపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ప్రశాంత్ తులసీ గద్దైపె పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ క్రమంలో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment