
అన్నదమ్ముల అనుబంధం
అనుబంధం... ఇది అన్నదమ్ముల అనుబంధం... అని పాడుకోవడానికి మాత్రమే కాదు.
భలే బాయ్స్
అనుబంధం... ఇది అన్నదమ్ముల అనుబంధం... అని పాడుకోవడానికి మాత్రమే కాదు. నిజమైన అనుబం«ధమే. వాళ్లు నలుగురూ అన్నదమ్ములు, ఆ నలుగురూ కవలలు. క్వాడ్రప్లెట్స్. చిన్నప్పుడు నలుగురూ కలిసి ఫుట్‌బాల్ ఆడుకున్నారు. కలిసే పెరిగారు. అంతా ఒకే చోట చదవాలనుకున్నారు. వారికి ఓ యూనివర్శిటీ సీట్లిచ్చింది. అది కూడా వాళ్లు కోరుకున్న కోర్సుల్లో. ఇది సినిమా కథ కాదు. జరిగిన యదార్థం. ఇది అమెరికాలోని ఓహియోలో జరిగింది. నిక్, జాక్, నిగెల్, ఆరాన్‌వాద్... ఈ నలుగురూ కవల పిల్లలు. వాళ్లందరూ యేల్ యూనివర్శిటీలో చేరారు. నిజానికి ఈ సోదరులకు అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీలు వారు కోరిన కోర్సుల్లో సీట్లు ఇచ్చాయి. ఆ కాలేజీల్లో చేరితే అందరూ ఒకే యూనివర్శిటీలో చదివే అవకాశం ఉండదు. ఈ ప్రయత్నంలో వారికి యేల్ యూనివర్శిటీ ఈ గొప్ప అవకాశాన్నిచ్చింది.
అన్నదమ్ముల్లో అరాన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చదవాలనుకున్నాడు, న్యూరోసైన్స్ చదివి డాక్టర్ కావాలన్నది నీగెల్ కోరిక. జాక్‌కి కెమికల్ ఇంజనీరింగ్ ఇష్టం. నిక్ ఆర్ట్స్, ఫారిన్ స్టడీస్ చదివే ఆలోచనలో ఉన్నాడు. ఫుట్‌బాల్ ఆటలో ప్రావీణ్యం ఈ బ్రదర్స్‌కి ఉన్నత చదువుల కోసం ఐవీ లీగ్ భారీ ప్యాకేజ్ ప్రకటించింది. వారికి ఈ ఏడాది మే నెలలో సీట్లు ఖరారయ్యాయి. ఇప్పుడు పాఠాలు మొదలయ్యాయి. నలుగురబ్బాయిల తండ్రి డారిన్ వాద్ సీనియర్ సాఫ్ట్‌వేర్ నిపుణులు. కొడుకుల నిర్ణయం తనకు చాలా ఆనందంగా ఉందంటూ మురిసిపోయాడు.
అన్నదమ్ముల చిన్నప్పటి ఫొటో