దివిటే శ్రీకాంత్ (ఫైల్), దివిటే దిలీప్ (ఫైల్)
సాక్షి, సిర్పూర్(ఆదిలాబాద్): పెళ్లి వేడుకలకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అన్నదమ్ములు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రంలో బెస్తకాలనీలో శనివారం తీవ్ర విషాదాన్ని నింపింది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ సురేష్ గౌడ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బెస్తకాలనీకి చెందిన దివిటే బావోజీ, శశాబాయి దంపతులకు నలుగురు కుమారులు. చిన్నవారైన దివిటే దిలీప్(26) తాపీ మేస్త్రీగా పని చేస్తుండగా దివిటే శ్రీకాంత్(21) కూలీ పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. చదవండి: కూతురి ఎఫైర్: తండ్రికి నిప్పంటించి..
ఇద్దరు అన్నదమ్ములు మూడు రోజులుగా మద్యం మత్తులోనే ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓ పెళ్లి వేడుకకు వెళ్తున్నామని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో మద్యం తాగి బెస్తకాలనీ సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు చేరుకున్నారు. మద్యం మత్తులో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలకు సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment