ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆ బాలిక ఇంటిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. దానిలో ఆమె తాను సూసైడ్ చేసుకునేందుకు గల కారణాలను వివరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక సోదరులు మద్యానికి బానిసగా మారి ఇంటిలోని వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఇబ్బందులను భరించలేకనే వారి సోదరి ఆత్మహత్య చేసుకుంది.
కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-4లో ఉంటున్న ఆ బాలిక ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి ఆ ఇంటిలో మృతురాలు స్వయంగా రాసిన సూసైడ్ నోట్ లభ్యమయ్యింది.
మద్యం మత్తుకు బానిసలైన సోదరులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16 ఏళ్ల బాలిక తన తల్లి, ఇద్దరు సోదరులతో పాటు ఈ ప్రాంతంలో ఉంటోంది. ఆ బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. తల్లి ఇంటి భారాన్నిమోస్తోంది. ఆ బాలిక ఇద్దరు సోదరులు నిత్యం మద్యం మత్తులో మునిగితేలుతుంటారు. తల్లీకూతుర్లు ఈ విషయమై వారిని హెచ్చరించినా వారు తమ వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు ఏదో కేసులో జైలుకు వెళ్లాడు. తాజాగా ఆ బాలిక ఇంటిలో ఉన్న సోదరునికి తన ఫోను ఇచ్చి, మరమ్మతు చేయించి తీసుకురమ్మని చెప్పి బయటకు పంపింది. తల్లి కూడా పని కోసం వెళ్లింది.
సూసైడ్ నోట్‌లో మరో యువకుని పేరు?
ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక సూసైడ్‌నోట్ రాసింది. దానిలో ఆమె తన సోదరులు మద్యానికి బానిస కావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పెద్దగా చదువుకోకపోయినా ఆ బాలిక సూసైడ్ నోట్‌ను ఇంగ్లీషులో రాసింది. ఆ నోట్‌లో ఆమె ఒక యువకుని పేరు రాసింది. అతను తన సోదరుని స్నేహితుడని, తన మృతదేహాన్ని చూసేందుకు అతనికి అవకాశం కల్పించాలని కోరింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
Comments
Please login to add a commentAdd a comment