గుండెలు పిండేసే చిత్రం.. | Journalist Captures Picture of Girl Drinking from Sidewalk Puddle in Argentina Heatwave | Sakshi
Sakshi News home page

గుండెలు పిండేసే చిత్రం..

Published Wed, Dec 20 2017 3:38 PM | Last Updated on Wed, Dec 20 2017 3:48 PM

Journalist Captures Picture of Girl Drinking from Sidewalk Puddle in Argentina Heatwave - Sakshi

దుర్భర దారిద్ర్యంలో మగ్గుతూ, ఆకలికి అలమటిస్తూ, భగభగమండే భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక దాహంతో ఓ చిన్నారి రోడ్డుపై నిలిచిన మురికినీరు తాగుతున్న విషాద దృశ్యమిది. మంగళవారం అర్జెంటీనాలోని పొసడాస్‌ సిటీలో ఐక్యరాజ్య సమితి బాలల నిధి(యూనిసెఫ్‌) వాలంటీర్‌ ఒకరు ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

దీంతో అర్జెంటీనాలో నెలకొన్న దారుణ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేబా గరానీ తెగకు చెందిన భిక్షాటన చేసే వందలాది మంది చిన్నారులు ఇలా కడుపునింపుకుంటున్నారని ఈ ఫొటో తీసిన స్థానిక జర్నలిస్ట్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement