పోలీసులకు పట్టుబడిన బాక్సర్‌మంజ, అశోక్‌కుమార్, ఎస్‌ఐ చల్లఘట్టచంద్ర
► సస్పెన్షన్‌కు గురై పరారీలో ఉన్న ఎస్‌ఐ అరెస్ట్
► అతని ఇద్దరు సోదరులు కూడా
బనశంకరి(కర్నాటక): సస్పెన్షన్‌కు గురై పరారీలో ఉన్న ఓ ఎస్‌ఐ తన ఇద్దరు సోదరులతో కలిసి దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు అతనితోపాటు ఇద్దరు సోదరులను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు పోలీస్‌కమిషనర్ ఎస్.రవి కథనం మేరకు..
1987లో సీఐఎస్‌ఐఎఫ్‌లో ఏఎస్‌ఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ అలియాస్ చల్లఘట్ట చంద్ర పదోన్నతిపై ఎస్‌ఐగా నియమితులయ్యారు. అయితే వివిధ కారణాలతో 2001లో చల్లఘట్ట చంద్రను సస్పెండ్ చేశారు. అనంతరం తన ఇద్దరు సోదరులైన బాక్సర్‌మంజ, అశోక్ తో కలిసి ముఠాగా ఏర్పడి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డాడు.ఈ ముగ్గురిపై జీవనభీమానగర పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైంది. అంతేగాకుండా చల్లఘట్ట చంద్రపై హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, చెన్నపట్టణ గ్రామాంతర, ఎలక్ట్రానిక్‌సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దోపిడీ కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ఇతడిపై కోర్టులో ప్రోక్లోమేషన్ కూడా జారీ అయ్యింది. ఎట్టకేలకు సీసీబీ పోలీసులు గాలింపు చేపట్టి ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు.