కృష్ణా జలాలు తీసుకుంది చాలు! | KRMB Clarification to immediately stop taking water from Srisailam and Sagar | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలు తీసుకుంది చాలు!

Published Thu, Apr 4 2024 7:28 AM | Last Updated on Thu, Apr 4 2024 7:28 AM

KRMB Clarification to immediately stop taking water from Srisailam and Sagar  - Sakshi

తెలంగాణకు కృష్ణాబోర్డు ఆదేశం 

శ్రీశైలం, సాగర్‌ నుంచి నీళ్లు తీసుకోవడాన్ని తక్షణమే ఆపాలని స్పషీ్టకరణ 

ఏపీ ఫిర్యాదు మేరకు చర్యలు 

కృష్ణా బోర్డు వైఖరిపై తెలంగాణ అసంతృప్తి

వివాదంపై కేంద్రానికి లేఖ రాయనున్న బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి నీళ్లను తీసుకోవడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని కృష్ణా నదీయాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్యులు డాక్టర్‌ ఆర్‌ఎన్‌ శంఖువా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఈ నెల 2న లేఖ రాశారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ జరిపిన కేటాయింపులకు మించి 7.391 టీఎంసీ లను తెలంగాణ వాడుకుందని ఫిర్యాదు చేస్తూ  ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది.  

కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. 
శ్రీశైలం, సాగర్‌ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్‌–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్‌ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది. ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది.

2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్‌) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. 
           
నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం 

ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలు ఉంటారు. 

ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి 
నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్‌ కనీస నిల్వమట్టం(డెడ్‌ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.  

కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ 
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది. ఈ నెల 1న ఏపీ రాసిన లేఖకు స్పందించి ఆయన ఈ లేఖ రాయడం గమనార్హం. ఉభయ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో మిగిలిన కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకు వాడుకొనే విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది.  

కృష్ణాబోర్డుపై తెలంగాణ గరం.. 
శ్రీశైలం, సాగర్‌ జలాశయాల నుంచి కేటాయింపులకు మించి 7.391 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టు ఏపీ చేసిన ఆరోపణలతో ఏకీభవిస్తూ కృష్ణాబోర్డు తెలంగాణను కట్టడి చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు ఈ వ్యవహారంలో కృష్ణాబోర్డు తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. త్వరలో రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా కృష్ణాబోర్డుకు తమ నిరసనను తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా ట్రిబ్యునల్‌–1 అవార్డు ప్రకారం శ్రీశైలం, సాగర్‌ నుంచి తాగునీటి అవసరాల కోసం వాడుకున్న జలాల్లో 20శాతాన్ని మాత్రమే లెక్కించాల్సి ఉండగా, 100 శాతం జలాలను కృష్ణాబోర్డు లెక్కించడాన్ని చాలాకాలంగా తెలంగాణ తప్పుబట్టుతోంది.

 ఈ వాదనలను ఇప్పటికే కృష్ణాబోర్డు తిరస్కరించింది. 2022–23లో తమ రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో 18.701 టీఎంసీలను వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకున్నామని, ఆ నీళ్లను ప్రస్తుత నీటి సంవత్సరం 2023–24లో సైతం తమ రాష్ట్రానికి పునః కేటాయింపులు(క్యారీ ఓవర్‌) జరపాలని తెలంగాణ చేసిన మరో డిమాండ్‌ను సైతం కృష్ణాబోర్డు తిరస్కరించింది. ఈ రెండు డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని రెండు రాష్ట్రాల నీటి వినియోగం లెక్కలను పునఃసమీక్షిస్తే తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఇంకా మిగిలి ఉంటాయని, ఏపీ కేటాయింపులకు మించి వాడుకున్నట్టు తేలుతుందని తెలంగాణ వాదిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 18.7 టీఎంసీల జలాలు ఇంకా తమకు రావాల్సి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్క తేలి్చనట్టు సమాచారం. 2022–23లో సైతం ఏపీ కేటాయింపులకు మించి 51.745 టీఎంసీలను వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తోంది. 

నేటి త్రిసభ్య కమిటీ భేటీకి రాలేం 
ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణాబోర్డు.. త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టగా, ఈ సమావేశానికి రాలేమని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తెలియజేశాయి. సమావేశాన్ని వాయిదా వేయాలని కోరినట్టు తెలిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయిన నేపథ్యంలో రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణాబోర్డు భావిస్తోంది. త్రిసభ్య కమిటీ కనీ్వనర్‌గా కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే, సభ్యులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలు ఉంటారు. 

ఆ 8 టీఎంసీలు తెలంగాణకు కావాలి 
నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 512.5 అడుగులకు పడిపోగా నిల్వలు 136.95 టీఎంసీలకు తగ్గిపోయాయి. నాగార్జునసాగర్‌ కనీస నిల్వమట్టం(డెడ్‌ స్టోరేజీ) 505 అడుగులు కాగా, బుధవారం నాటికి జలాశయంలో కనీస నిల్వమట్టానికి ఎగువన వాడుకోవడానికి వీలుగా 13.617 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయి. ఏపీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి కుడి ప్రధాన కాల్వకు ఈ నెల 8 నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేసినా, మిగిలిన 8.61 టీఎంసీలను హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలకు కేటాయించడానికి వీలుంటుందని తెలంగాణ నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.  

కేంద్రం దృష్టికి కృష్ణా జలాల పంచాయితీ 
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తాజాగా కృష్ణాబోర్డు నిర్ణయించింది. ఈ విషయంలో తదుపరి కార్యాచరణను సూచించాలని విజ్ఞప్తి చేస్తూ జలశక్తి శాఖకు కృష్ణాబోర్డు లేఖ రాయనున్నట్టు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement