
సాక్షి, జగిత్యాల : కన్న కొడుకు బతికే ఉన్నా తండ్రి అంత్యక్రియలు చేయలేని దురదృష్టకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బిర్పూర్ మండంలోని కోల్వాయి గ్రామంలో రాములు(63) అనే వ్యక్తి అనారోగ్యంతో శనివారం మరణించాడు. అయితే మృతుడి కొడుకు రాజేందర్‌కు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఈ కారణంతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొడుక్కి అవకాశం లేకుండా పోయింది. దీంతో మృతుడి భార్య కూతురు రాములుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment