కాల్వలోకి కారు.. ప్రాణాలు కోల్పోయిన అడ్వకేట్‌ | Jagtial Car Crashes Into SRSP Canal 3 Persons Missing One Drowned | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ కాలువలోకి కారు.. ముగ్గురు మృతి

Published Mon, Feb 15 2021 8:27 AM | Last Updated on Mon, Feb 15 2021 12:00 PM

Jagtial Car Crashes Into SRSP Canal 3 Persons Missing One Drowned - Sakshi

అమరేందర్ రావు, శిరీష, శ్రేయ ఫైల్ ఫోటోలు

సాక్షి, జగిత్యాల: జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. అమరేందర్ రావు భార్య శిరీషా కూతురు శ్రేయా, కుమారుడు జయంత్ నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

ముగ్గురు కారుతో సహ గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పేవరకు కారు కెనాల్‌లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కెనాల్‌లో నీటిని నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో గల్లైంతన అమరేందర్ రావు, ఆయన భార్య శిరీషా, కూతురు శ్రేయా ముగ్గురు మరణించారు. అధికారులు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. అమరేందర్ రావు జగిత్యాలలో న్యాయవాదిగా పనిచేస్తారని స్థానికులు తెలిపారు. బయటపడ్డ జయంత్ మాట్లాడేందుకు నిరాకరించారు. 

చదవండి: వరంగల్‌: కాలువలోకి దూసుకెళ్లిన కారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement