
సాక్షి, వరంగల్ : వేగంగా దూసుకువస్తున్న కారు కెనాల్ పడిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్‌లో పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. అందులో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా తెలుస్తోంది. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. కారును కెనాల్ నుంచి బయటకు తీశారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment