
సాక్షి, జగిత్యాల : జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్తాపూర్ వాసి లింగన్నను జమ్మూకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌లో ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న రాకేష్ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎర్నియా పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఆయనపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో రాకేష్ ఖాతాకి జగిత్యాల జిల్లాకు చెందిన వ్యాపారి లింగన్న ఖాతాను నుంచి కొంతనగదు జమైంది. పోలీసుల విచారణలో ఈ విషయం బయపటడంతో మంగళవారం కశ్మీర్ పోలీసులు జగిత్యాలకు చేరుకుని లింగన్నను అదుపులోకి తీసుకున్నారు. రాకేష్‌తో అతనికి ఉన్న సంబంధాలపై స్థానిక పోలీస్టేషన్‌లో విచారణ జరుపుతున్నారు.