భర్త మృతి.. ముగ్గురు కూతుళ్లతో కలిసి పుట్టింటికి వెళ్తున్నానని.. | Karnataka: Two Daughter Survives Suicide Bid Mother One Child Goes Missing | Sakshi
Sakshi News home page

కోవిడ్‌తో భర్త మృతి.. ముగ్గురు కూతుళ్లతో కలిసి పుట్టింటికి వెళ్తున్నానని..

Published Thu, Sep 30 2021 8:43 AM | Last Updated on Thu, Sep 30 2021 9:00 AM

Karnataka: Two Daughter Survives Suicide Bid Mother One Child Goes Missing - Sakshi

సాక్షి, బళ్లారి: కోవిడ్‌ రక్కసి కాటుకు ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కరోనాకు కుటుంబ పెద్ద బలి కావడంతో, నలుగురు ఆడపిల్లల్ని పోషించలేక ఓ తల్లి పిల్లలతో కలిసి నదిలో దూకింది. ఈ సంఘటనలో తల్లీ, చిన్న కూతురు మరణించగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోరం కర్ణాటకలోని గదగ్‌ జిల్లా రోణ తాలూకా హుళే ఆలూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉమాదేవి (40) అనే మహిళ భర్త నెల కిందట కోవిడ్‌తో కన్నమూశాడు.

ఆమెకు నలుగురు కూతుళ్లు కాగా, పెద్ద కూతురు గదగ్‌లో హాస్టల్లో ఉండి ఇంటర్‌ చదువుతోంది. భర్త చనిపోయినప్పటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఆమెకు రూ. 7 లక్షల వరకూ అప్పులు ఉన్నట్లు తెలిసింది. పుట్టింటికి వెళ్తున్నానని ఇరుగుపొరుగుకు చెప్పి ముగ్గురు కూతుళ్లను తీసుకుని తెల్లవారుజామునే వెళ్లిపోయి సమీపంలోని మలప్రభ నదిలోకి దూకింది. సమీపంలో ఉన్న వ్యక్తులు హుటాహుటిన నదిలోకి దూకి 12, 14 ఏళ్ల ఇద్దరు బాలికల్ని కాపాడారు, కానీ ఉమాదేవి, 8 ఏళ్ల చిన్నకూతురు నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు.

చదవండి: అంతా బాగానే ఉంది.. ఆరేళ్లుగా సహజీవనం చేసి చెప్పకుండానే..

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement