
సరిత (ఫైల్), పుగల్‌కొడి
సాక్షి, చెన్నై: సెల్‌ఫోన్‌లో మగవాళ్లతో ఎక్కువ సమయం మాట్లాడుతుందనే కారణంతో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ట్రిప్లికేన్‌కు చెందిన పుగల్‌కొడి అలియాస్ ఢిల్లీ (29) ఫుడ్ డెలివరీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతని భార్య సరిత (21). మైలాపూర్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో పని చేస్తోంది.
ఈ క్రమంలో సరిత తన స్నేహితుడు జగదీశన్‌తో ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటంతో దంపతుల మధ్య తరచూ గొడవ జరిగేది. గత 17వ తేదీ ఏర్పడిన ఘర్షణ లో పుగల్‌కొడి తన భార్య సరితపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సరిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కన్నగినగర్ పోలీసులు పుగల్‌కొడిని అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు.
చదవండి: (జరిమానా విధించినందుకు ఎస్‌ఐ గొంతు కోశాడు.. సీఎం పరామర్శ)
Comments
Please login to add a commentAdd a comment