సాక్షి, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతోంది. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా ఉదయం 11 గంటలకు జాజిరెడ్డిగూడెంలో అసమ్మతి వర్గం సమావేశం సమావేశం కానుంది. దగా పడ్డా కాంగ్రెస్ సీనియర్ ల్లారా కదలిరండి పేరుతో కార్యక్రమం చేపట్టారు. డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. గత కొంతకాలంగా సామేల్, యోగానంద చారి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో జాజిరెడ్డిగూడెం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా యోగానంద నిరసన కార్యక్రమం చేయించారు. అసమ్మతి వర్గం వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.
కాగా, జాజిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం. జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం, తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని.. కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యే అవకాశం కూడా పార్టీలో లేదా అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. సామేల్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీఆర్ఎస్‌లో ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచిపెట్టకపోతే జాజిరెడ్డిగూడెం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై!
Comments
Please login to add a commentAdd a comment