సాక్షి, సూర్యాపేట: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి(డీకే శివకుమార్) వచ్చి మనకు సుద్దులుచెబుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మా దగ్గర 5 గంటల కరెంట్ ఇస్తున్నాం, వచ్చి చూడమని చెప్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారా? అని ప్రశ్నించారు.
దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దళితుల అభివృద్ధి గురించి గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయిన రోజే దళితుల అభివృద్ధికి కృషి చేస్తే బతుకులు మారేవని పేర్కొన్నారు. తెలంగాణలో కులవృత్తులకు జీవం పోశామని చెప్పారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టు నుంచి నీరు అందిస్తామని, బునదిగాని కాల్వ వెడల్పు చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు.
‘తుంగతుర్తిని చూస్తే తృప్తిగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యామాని లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. ఎన్నికలు రాగానే కొందరు ఓట్ల కోసం వస్తారు. ఎవరెన్ని చెప్పినా మీరు ఆలోచించి ఓటు వేయండి. గాదారి కిషోర్‌ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే తుంగతుర్తి యోజకవర్గానికి మొత్తానికి దళితబంధు ఇస్తాం. భయంకరమైన ఉద్యమంతో తెలంగాణ వచ్చింది. సంక్షేమ పథకాలు, పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు. పేదల కోసం ఆలోచించి రూ. వెయ్యితో పెన్షన్ ప్రారంభించుకున్నాం.
చదవండి: సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే
దశలవారీగా కళ్యాణలక్ష్మీ, పెన్షన్‌ను పెంచుకున్నాం. రైతు బంధును ఎమ్‌ఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. యూపీ, బిహార్ నుంచి వరినాట్లు వేయడానికి వస్తున్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ గోడలపై రాతలు కన్పించేవి. బస్మాపూర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాబోతున్నాయి. సుమారు రెండు లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి
తెలంగాణకు ముందు ఎవరైనా మాట్లాడితే నక్సలైట్ ముద్రేసి జైల్లో వేసేవారు. మనతో పొత్తు పట్టుకొని కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. 14 ఏళ్లు మనల్ని గోస పెట్టుకుంది. చెరుకు సధాకర్‌ను జైల్లో వేశారు. ప్రాణాలను బలి తీసుకొని తెలంగాణ ఇచ్చారు. ఆనాడు చెంచాగరి చేసినోళ్లు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తాం అంటున్నారు. అది ఎంత ప్రమాదమో ఆలోచన చేయాలి
ధరణి రావడం వల్ల అవినీతి అంతం అయింది. ధరణి రద్దు అయితే అవినీతి రాజ్యం వస్తుంది. మళ్ళీ కొట్లాటలు వస్తాయి. రైతు బంధు కూడా రాదు. ధరణి రైతులకు గుండె కాయ లాంటిది. రైతు బంధు వృధా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment