ఏసీసీ నికర లాభం 9% డౌన్ | ACC's Q4 net dips 8.7% on poor cement demand | Sakshi
Sakshi News home page

ఏసీసీ నికర లాభం 9% డౌన్

Published Fri, Apr 25 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

ఏసీసీ నికర లాభం 9% డౌన్

ఏసీసీ నికర లాభం 9% డౌన్

న్యూఢిల్లీ: సిమెంట్ దిగ్గజం ఏసీసీ జనవరి-మార్చి(క్యూ1) కాలానికి రూ. 400 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 438 కోట్లతో పోలిస్తే ఇది 9% క్షీణత. బొగ్గు, ఫ్లైయాష్, జిప్సమ్ వంటి ముడిసరుకుల వ్యయాలు పెరగడం, సిమెంట్ ధరలు తగ్గడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది.

జనవరి-డిసెంబర్ కాలాన్ని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ కాలంలో సిమెంట్ విక్రయాలు 6.48 మిలియన్ టన్నులకు చేరగా, టర్నోవర్ రూ. 2,967 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,906 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ మూడు నెలల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాధారణ నిర్మాణ కార్యకలాపాలు వంటివి పెద్దగా ఊపందుకోలేదని కంపెనీ వ్యాఖ్యానించింది. వెరసి సిమెంట్ విక్రయాల్లో పురోగతి సాధ్యపడలేదని తెలిపింది. సమీపకాలంలో సైతం సిమెంట్‌కు డిమాండ్ పుంజుకునే సంకేతాలు కనిపించడంలేదని అభిప్రాయపడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement